బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చాలా ప్రత్యేకం అని చెప్పాలి. బాలీవుడ్ లో స్టార్ హీరోలకి సైతం పోటీ ఇస్తూ వారితో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ గా కంగనా పేరు వినిపిస్తుంది. అలాగే బాలీవుడ్ పై పెత్తనం చేసే నెపోటిజం బ్యాచ్ ని తీవ్రంగా వ్యతిరేకించే వారిలో కంగనా ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా కరణ్ జోహార్ తో పాటు సెలబ్రెటీ ఫ్యామిలీల నుంచి వస్తూ ఎలాంటి కష్టం లేకుండా హీరోయిన్స్ అయిపోయిన తారలపని కూడా కంగనా ద్వేషిస్తూ ఉంటుంది. అలాగే బీజేపీ పార్టీని అభిమానిస్తూ ఉంటుంది. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత కంగనా బ్యాచ్, అలాగే కరణ్ జోహార్ బ్యాచ్ గా బాలీవుడ్ ఇండస్ట్రీ మారిపోయింది.
ఇక సినిమా తారలు అంటే ఖరీదైన డ్రెస్సులు గుర్తుకొస్తాయి. పలానా హీరోయిన్ వేసిన డ్రెస్ ఖరీదు ఇన్ని లక్షలు, పాలనా హీరో వేసుకున్న ప్యాంట్ ధర ఇన్ని లక్షలు అంటూ సోషల్ మీడియాలో తరుచుగా కథనాలు చూస్తూ ఉంటాం. అయితే తాజాగా కంగనా రనౌత్ సింపుల్ శారీలో దర్శనం ఇచ్చింది. ఆ ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆమె ధరించిన చీర ఖరీదు అక్షరాల 600 రూపాయిలు.
అంత తక్కువ ఖరీదు కలిగిన చీరలు నిజానికి మధ్యతరగతి, సాధారణ మధ్యతరగతి స్త్రీలు కడుతూ ఉంటారు. అయితే ఎలాంటి బ్రాండ్ లేని ఆ చీరని కట్టుకోవడానికి కారణాన్ని కూడా కంగనా చెప్పింది. లోకల్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ 600 రూపాయిల చీరని ధరించినట్లు చెప్పింది. మన బట్టి వేసుకున్న వస్త్రానికి అందం రావాలని, బట్టల బట్టి మనకి అందం రావడం అంటే అది ఒరిజినాలిటీ కాదనే విషయం అర్ధం చేసుకోవాలనే సందేశాన్ని కంగనా ఆ చీర కట్టుకొని ఇచ్చిందని ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట.