సీతారామం సినిమా మానియా బాలీవుడ్ లో ఇప్పటికి కొనసాగుతుంది. సౌత్ లో రిలీజ్ అయిన 25 రోజుల తర్వాత హిందీ వెర్షన్ నార్త్ ఇండియా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక సినిమాలో హిందీ డబ్బింగ్ లో మృణాల్, దుల్కర్ తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇక సినిమా కథ కూడా కాశ్మీర్, హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో నడవడంతో అక్కడి ప్రేక్షకులకి భాగా రీచ్ అయ్యింది. మృణాల్ ఠాకూర్ చేసిన నూర్జహాన్ అలియాస్ సీత పాత్రలో భిన్నమైన షేడ్స్ ఉండటంతో మరింత బాగా అక్కడి ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. ఇండియన్ సినిమా అంటే ఎప్పుడు కూడా హిందూ, ముస్లిం మధ్య శత్రుత్వాన్ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇందులో పాకిస్థాన్ నేపధ్యం చూపించిన కూడా అందులో ఇండియాపై ఉన్న ద్వేషం చూపించడంతో పాటు వారిలో కూడా మానవత్వం ఉంటుందని ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు.
అలాగే కాశ్మీర్ లో ముస్లిమ్స్ అందరూ హిందువులని ప్రేమిస్తూ ఉంటారని, కొందరు కావాలని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని అంతర్లీనంగా కొన్ని సన్నివేశాల ద్వారా ఆవిష్కరించారు. ఇలాంటి సీన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి. అంతకు మించి రామ్, సీత ప్రేమకథ హృదయాల్ని తాకింది. దీంతో సినిమాకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా సీతారామం సినిమాపై తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రశంసలు కురిపించింది. సీతారామం సినిమా చూడటానికి చాలా రోజుల తర్వాత టైం దొరికిందని చెప్పింది.
ఇక ఈ సినిమా అద్భుతంగా ఉందని, దర్శకుడు హను అద్భుతంగా కథని తెరపై ఆవిష్కరించారని చెప్పింది. అలాగే రామ్ పాత్రలో దుల్కర్ నటనపై ప్రశంసలు కురిపించింది. ఇక సీతగా మృణాల్ ఠాకూర్ చేసిన పాత్ర ఇప్పటికి నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉందని, ఆ పాత్రకి ఆమె తప్ప అనే రీతిలో పెర్ఫార్మెన్స్ తో మెప్పించిందని కంగనా ప్రశంసలు కురిపించింది. ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలపై కంగనా ఎక్కువగా మక్కువ చూపిస్తుంది. అందుకు తగ్గట్లుగానే మన సినిమాలో నార్త్ ఇండియా ప్రేక్షకులని అలరిస్తూ ఉండటం విశేషం.