రజినీకాంత్ హీరోగా, నయనతార కెరియర్ ఆరంభంలో వచ్చిన చంద్రముఖి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ మూవీ తెలుగు, తమిళ్ భాషలలో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో జ్యోతిక చేసిన చంద్రముఖి పాత్రని ఇప్పటికి ఎవరూ మరిచిపోలేరు. ఇక 18 ఏళ్ళ తర్వాత పి వాసు దర్శకత్వంలోనే చంద్రముఖి మూవీకి సీక్వెల్ తెరకెక్కుతుంది. అయితే ఈ సీక్వెల్ లో ఈ సారి లారెన్స్ మెయిన్ హీరోగా నటిస్తన్నాడు. పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.
హై బడ్జెట్ తో మరింత భారీగా చంద్రముఖి సీక్వెల్ ని ఈ సారి తెరకెక్కిస్తూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ మూవీలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాపై కంగనా కూడా తాజాగా స్పందించింది. చంద్రముఖి లాంటి ప్రెస్టీజియస్ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలపై ఆమె తన ప్రేమని చూపిస్తుంది. తమిళంలో జయలలిత బయోపిక్ లో ఆమె నటించింది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అలాగే ఝాన్సీ లక్ష్మి భాయ్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన మణికర్ణిక సినిమాకూడా మంచి స్పందన వచ్చింది. ఈ నేపధ్యంలో సౌత్ దర్శకులు, కథలని కంగనా బలంగా నమ్ముతుంది. ఈ నేపధ్యంలోనే చంద్రముఖి సీక్వెల్ లో నటించడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక కంగనా నటించడం ద్వారా ఈ మూవీకి హిందీలో కూడా మంచి హైప్ క్రియేట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు.