సౌత్ ఇండియాలో స్టార్ హీరోలు అంటే మెగాస్టార్ చిరంజీవి, కమల్ హసన్, రజినీకాంత్ పేర్లు ముందు వరుసలో వినిపిస్తాయ. వీరి తర్వాత ఇంకెవరైనా కూడా. వీరు ముగ్గురు కూడా 60 ఏళ్ళు పైబడిన కూడా ఏ మాత్రం స్పీడ్ తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కథల పద్ధతి మార్చుకొని వారి వయస్సుకి సెట్ అయ్యే స్టోరీలు ఎంపిక చేసుకొని దూసుకుపోతున్నారు. ఇక సీనియర్ స్టార్స్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో అంటే మొన్నటి వరకు రజినీకాంత్ పేరు వినిపించేది. ఆయన ఒక్కో సినిమాకి వంద కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ వస్తున్నారు.
ఆ తరువాత చిరంజీవి కూడా 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే మొన్నటి వరకు కమల్ హాసన్ ఈ టాప్ జాబితాలో లేరని చెప్పాలి. దీనికి కారణం విశ్వరూపం సీక్వెల్ తర్వాత కమల్ నుంచి సినిమాలు రాలేదు. సుదీర్ఘంగా గ్యాప్ తీసుకున్న కమల్ హాసన్ మరల విక్రమ్ సినిమాతో యాక్టివ్ అయ్యారు. ఆ సినిమాతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఇండియన్ 2 సీక్వెల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండియన్ 2 కోసం కమల్ హాసన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ మూవీలో కమల్ రెమ్యునరేషన్ గానే 150 కోట్లు తీసుకుంటున్నారని టాక్. ఇక దర్శకుడు శంకర్ కూడా 50 కోట్ల చిల్లర రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు బోగట్టా. ఇలా వీరిద్దరి ద్వారా నిర్మాతకి బడ్జెట్ 200 కోట్ల వరకు అవుతుంది. ఇక మిగిలిన క్యాస్టింగ్, సినిమా బడ్జెట్ అంతా కలిసి 100 కోట్ల మేరకు ఉంటుందని టాక్. మొత్తానికి సీనియర్ స్టార్ హీరోలైన ఈ ముగ్గురు సౌత్ లోనే కాకుండా ఇండియన్ వైడ్ గా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 10 హీరోల జాబితాలో ఉండటం విశేషం. వయస్సు పేరైన వారికున్న ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పడానికి నిర్మాతలు వీరికి ఇస్తున్న రెమ్యునరేషన్ ని ఒక ఉదాహరణగా చూపించొచ్చు.