మలయాళ సీనియర్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ గారాలపట్టి కళ్యాణి ప్రియదర్శన్ తెలుగు సినిమా హలో తోనే తెరంగేట్రం చేసింది. అక్కినేని యువ హీరో అఖిల్ లీడ్ రోల్ లో విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేసిన సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది. మొదటి సినిమాతోనే తన క్యూట్ లుక్స్ తో ఆడియన్స్ ని అలరించిన కళ్యాణి ఆ తర్వాత సాయి తేజ్ హీరోగా వచ్చిన చిత్రలహరి సినిమాలో కూడా నటించింది.

కళ్యాణి ప్రియదర్శన్ :
ఆ సినిమా అమ్మడికి మంచి ఫలితాన్ని అందించింది. శర్వానంద్ తో రణరంగం సినిమా కూడా చేసింది కళ్యాణి తన మొదటి 3 సినిమాలు తెలుగులో చేసిన కళ్యాణి సొంత భాష మలయాళంలో వరనే అవశ్యముండ్ సినిమాతో అక్కడ హీరోయిన్ గా తొలి ప్రయత్నం చేసింది.
తెలుగులో కళ్యాణి నటించిన సినిమాలు మూడింటిలో ఒకటి మాత్రమే హిట్ అవగా మిగతా రెండు ఫ్లాప్ అయ్యాయి. అందుకే తెలుగు దర్శక నిర్మాతలు కూడా కళ్యాణి మీద అంతగా ఆసక్తి చూపించట్లేదని తెలుస్తుంది. అయితే కళ్యాణి మాత్రం తన మనసుకి నచ్చిన కథ వస్తే మాత్రం తప్పకుండా తెలుగులో నటించడానికి రెడీ అని అంటుంది. కళ్యాణి ప్రియదర్శన్ ని ఇష్టపడుతున్న తెలుగు ఆడియన్స్ ఆమెను మళ్లీ తెలుగు సినిమాల్లో చూడాలని కోరుతున్నారు.