బింబిసార సినిమాతో కెరియర్ లో డబల్ బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ నెక్స్ట్ కూడా ఇదే స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ చివరి దశకి చేరుకుంది. రీసెంట్ గా ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకొని చివరి షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ఇక కళ్యాణ్ రామ్ కెరియర్ లోని ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రని ఈ మూవీలో చేస్తున్నాడు. ఇక ఈ మూవీకి టైటిల్ నిర్ణయించలేదు. అయితే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ వుండబోతుందనే మాట వినిపిస్తుంది.
భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. అమిగోస్ అనే టైటిల్ ని ఈ చిత్రానికి ఖారారు చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఆషిక రంగనాథ్ ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతుంది. మూడు విభిన్నమైన పాత్రలతో ఈ మూవీలో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులని అలరించబోతున్నాడు. ఇక దీని తర్వాత డెవిల్ అనే సినిమాని కూడా ఇప్పటికే సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు.
ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ తో సినిమాపై ప్రేక్షకుల అంచనాలు పెంచారు. మరో వైపు బింబిసార పార్టీ 2కి కూడా కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. మొదటి పార్ట్ కంటే మరింత ఎక్కువ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని ఆవిష్కరించడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా వరుస ప్రాజెక్ట్స్ తో కళ్యాణ్ రామ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. గతంలో ఎక్కువ గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేసిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన మార్కెట్ ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తూ ఉండటం విశేషం.