మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజని ప్రేమించి పెళ్లి చేసుకొని మెగా ఇంటికి అల్లుడుగా కళ్యాణ్ దేవ్ వచ్చాడు. ఇక మెగాస్టార్ అల్లుడు అయిన తర్వాత కళ్యాణ్ దేవ్ తనకున్న ఫాషన్ తో హీరోగా పరిచయం అయ్యాడు. రాకేష్ శశి దర్శకత్వంలో విజేత టైటిల్ తో మొదటి సినిమా చేశాడు. మెగాస్టార్ దగ్గరుండి ఈ సినిమాని ప్రమోట్ చేశారు. అయితే ఆశించిన స్థాయిలో ఈ మూవీ సక్సెస్ కాలేదు. తరువాత కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు సరైన సక్సెస్ మాత్రం కళ్యాణ్ దేవ్ కి రాలేదు. అయితే గత కొంతకాలంగా శ్రీజతో విభేదాల కారణంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారని, విడాకులు కూడా తీసుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అందుకు తగ్గట్లుగానే అతని తరువాత సినిమాల రిలీజ్ విషయంలో మెగా ఫ్యామిలీ నుంచి ఎలా ప్రచారం లేదు.
అసలు తమకి సంబంధం లేనట్లుగానే ఆ సినిమాల విషయంలో వారు ఉన్నారు. దీంతో మెగా ఫ్యామిలీ కి కళ్యాణ్ దేవ్ దూరం అయ్యాడని స్పష్టం అయిపొయింది. ఇక అతను కూడా తన ఇన్స్టాగ్రామ్ లో శ్రీజతో కలిసి ఉన్న ఫోటోలని డిలేట్ చేశాడు. శ్రీజ కూడా అలాగే చేసింది. కళ్యాణ్ దేవ్, శ్రీజకి ఒక కూతురు కూడా ఉంది. వీరి పెళ్లి పెటాకులు కావడంతో శ్రీజ ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ గా మారి సినిమాలు చేస్తుంది. మూడో పెళ్లికి రెడీ అవుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ ఇద్దరు అమ్మాయిలతో చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ నా లైఫ్ ని మార్చేసిన కళల రాణి” అంటూ రాసుకొచ్చాడు.
దీంతో కళ్యాణ్ దేవ్ పక్కన ఉన్న అమ్మాయితో అతను డేట్ లో ఉన్నాడని, త్వరలో పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అవుతున్నాడని ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే కళ్యాణ్ దేవ్ పక్కన ఉన్న అమ్మాయి గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే ఆమె పేరు వర్ణిక రాథోర్ అని తెలిసింది. ఇంకో అమ్మాయి పేరు అంకిత అని క్లారిటీ వచ్చింది. వారిద్దరూ కళ్యాణ్ దేవ్ తరువాతి సినిమాలో హీరోయిన్స్ గా ఎంపిక అయ్యారు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబందించిన షూటింగ్ కూడా జరుగుతుంది. కళ్యాణ్ దేవ్ తన సినిమాని ప్రమోట్ చేయడానికి ఆ అమ్మాయిలతో ఉన్న ఫోటోలు షేర్ చేసి కళలరాణి అంటూ ట్వీట్ చేసాడనే విషయం క్లారిటీ వచ్చింది. కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరికి రెండో పెళ్లినే. ఇక వీరిద్దరూ విడిపోవడంతో ఇద్దరూ మూడో పెళ్ళికి రెడీ అవుతున్నారని చాలా కాలంగా ప్రచారం నడుస్తున్న నేపధ్యంలో కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన అమ్మాయిల ఫోటోలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి.