Allu Arjun Wife : గతంలో హీరోల భార్యలు బయటకు వచ్చేవారు కాదు.. కానీ ఇప్పటి హీరోల భార్యలు సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తమ అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటూ.. తమ భర్తల సినిమాలు, పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. చాలా మంది హీరోల భార్యలు మిలియన్స్ కొద్దీ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఒకరు. ఆమె ప్రస్తుతం బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు. స్నేహ సొంతంగా వ్యాపారం చేస్తూ బిజినెస్ రంగంలో దూసుకు పోవడమే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చాలా మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు.
ఇటీవలి కాలంలో స్నేహా హాట్ హాట్ డ్రెస్సులతో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని చూసిన అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. స్నేహారెడ్డితో ఏ సౌత్ హీరోయిన్ కూడా పోటీ పడలేదు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో సవాళ్లు సైతం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో స్నేహ పోస్ట్ చేస్తున్న పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కూడా స్నేహ ఒక ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో స్నేహ చాలా అందంగా కనిపిస్తున్నారు. ప్రముఖ డిజైనింగ్ శారీలో స్నేహారెడ్డి స్టన్నింగ్ లుక్‌లో కనిపించారు. సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ స్నేహకు స్టైలింగ్ చేశారు.
Allu Arjun Wife : నెట్టింట పెద్ద చర్చ
స్నేహారెడ్డి పోస్ట్ చేసిన ఫోటోపై చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ రియాక్ట్ అవుతూ హాట్ ఎమోజీతో స్నేహా.. అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం స్నేహా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కల్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీ నుంచి విడిపోయాడని.. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు విడాకులు ఇవ్వబోతున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ భార్య స్నేహ పిక్‌కు కామెంట్ పెట్టడం వైరల్‌గా మారింది. దీనిపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. అయితే ఇటీవలి కాలంలో కల్యాణ్ దేవ్ తన కూతురితో కనిపించిన పిక్స్ సైతం వైరల్ అయ్యాయి. దీంతో విడాకులు ఇవ్వడం లేదు.. శ్రీజతో కలిసి పోయాడంటూ మరో కొత్త చర్చ జరిగింది.