Kalvakuntla Kavitha : ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే పని భారతీయ జనతా పార్టీ చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇది బిజెపి ప్రభుత్వానికి కొత్తేమి కాదని గతంలోనూ 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేసిన ఘనత బిజెపికి దక్కుతుందని అన్నారు. సిబిఐ విచారణ తర్వాత తొలిసారిగా కవిత మీడియాతో మాట్లాడారు కవిత . ఈరోజు జరిగిన తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ఈ విధంగా స్పందించారు.

Kalvakuntla Kavitha : ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు విచారించారు సుమారు 6 గంటల పాటు కవితను ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం జాగృతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, సిబిఐ దాడులు జరిగిన తమ కంట కన్నీరు రాదని నిప్పులే వస్తాయని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. తెలంగాణ తరహాలోనే దేశవ్యాప్తంగా కూడా కొత్త ఉద్యమాన్ని లేవనెత్తాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కవిత తెలిపారు.కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన వారిపై దాడులు చేయడం సబబు కాదన్నారు. ఈ దాడులు కేవలం కవితపై కాదని కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. ఇలాంటి దాడులను మేము అసలు పట్టించుకోమని అన్నారు. మన సమయాన్ని వృధా చేసే పనులు ఎన్ని చేసినా దానికి మూడింతల రెట్లు మనం పని చేయాల్సిన అవసరం ఉందని జాగృతి శ్రేణులతో అన్నారు.

తెలంగాణ ఆడపిల్లల కంట నుంచి నీళ్లు రావు నిప్పులు వస్తాయని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదు అని ముందుకే సాగుతామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాష్ట్రంలోని కవులను, కళాకారులను, రచయితలను, విద్యార్థులను, మహిళలను, రైతులను, ఏకం చేసి వారితో మాట్లాడతాం., వారితో చర్చలు జరిపి సరికొత్త ఉద్యమానికి తెర తీస్తామని పేర్కొన్నారు.