Kalpika Ganesh : నిన్న మొన్నటి వరకూ ఏమో కానీ ‘యశోద’ మూవీ తర్వాత మాత్రం నటి కల్పికా గణేష్ పేరు బీభత్సంగా వినిపిస్తోంది. అమ్మడు ఇండస్ట్రీలోకి 2009లోనే వచ్చింది. కానీ ‘యశోద’ మూవీ వరకూ పెద్దగా గుర్తింపే రాలేదు. ప్రయాణం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కల్పిక.. ఆ తరువాత పెద్ద సినిమాలే చేసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడిపడి లేచే మనసు వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. కానీ ఆశించిన స్థాయి గుర్తింపును అయితే అందుకోలేక పోయింది.
అయితే అమ్మడు ఇప్పటి వరకూ కామ్ అండ్ కంపోజ్డ్‌గా పని చేసుకుంటూ వెళ్లిపోయింది. కానీ ఇప్పుడు ఎక్కువగా వివాదాలతోనే కాలం గడిపేస్తోంది. వివాదాలు అమ్మడిని వార్తల్లో అయితే నిలపగలవేమో కానీ అవకాశాల విషయంలో కాదు కదా. ఇవేమీ పట్టించుకోకుండా వివాదాలకు పదును పెడుతోంది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు తానొక 30 సినిమాలు చేశానని.. వాటిలో 15 మాత్రమే విడుదలయ్యాయని దీనికో కారణం చెప్పేసింది.
కొన్ని సినిమాలు చేసిన తరువాత కల్పికను పక్కన పెట్టేశారట. తాను హీరోయిన్స్ కంటే అందంగా కనిపించడమే దీనికి కారణమని ఆమె చెప్పుకొచ్చింది. హీరోయిన్‌ను డామినేట్ చేస్తోందనే పక్కన పెట్టేశారట. తాను చంద్రశేఖర్ యేలేటి స్కూల్ నుంచి వచ్చానని.. కానీ తనకు బయటి అలాంటి వాతావరణమే కనిపించలేదని వెల్లడించింది. ఏదైనా డైలాగ్ ఉందా అంటే యాటిట్యూట్ ఎక్కువ అనేవారట. అందరు క్యారెక్టర్ ఆర్టిస్టుల మాదిరిగా తాను వరుస సినిమాలు చేయలేదని.. పాత్ర, కథ నచ్చితేనే చేశానని చెప్పుకొచ్చింది. తను తక్కువ సినిమాలు చేయడానికి ఇదొక కారణమని కల్పిక తెలిపింది.