Kakinada :కరోనా మహమ్మారి ఎంతమంది జీవితాలను అతలాకుతలం చేసిందో అందరికీ తెలుసు. ఈ వైరస్ కారణంగా ఏడది పాటు ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గుట్టుగా బ్రతికారు. చాలా మంది ప్రజలు ఉద్యోగాలు పోగొట్టుకుని ఆర్థికంగా ఇబ్బందిపడేతే..ఇంకొందరు అనారోగ్య సమస్యలతో సతమతమయ్యాయి. అయితే గత ఏడాది కాలం నుంచే పరిస్థితులు కాస్త చక్కబడుతూ వస్తున్నాయి. ప్రజలు మళ్లీ తమ పనుల్లో కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. కరోనా మహమ్మారి జాడలు పూర్తిగా వీడకపోయినా జీవనోపాధి కోసం వీధిన పడ్డారు. అయితే దేశమంతా తమ తమ పనుల్లో నిమగ్నమైతే ఈ తల్లీ కూతుర్లు మాత్రం ప్రపంచానికి భిన్నంగా మహమ్మారి భయపడి గత మూడేళ్లు ఇంటికే పరిమితం అయ్యారు.

అసలు విషయానికి వస్తే కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో సూరిబాబు అతని కుటుంబ సభ‌్యులు నివాసముంటున్నారు. ఈయన భార్య మణి, కూతురు దుర్గా భావానిలు కరోనా సమయంలో మహమ్మారికి భయపడి ఇంట్లోనే ఉండిపోయారు. ఆ తరువాత పరిస్థితులు చక్కబడినా ఇంటి గుమ్మం దాటలేదు. చుట్టాలు ఫంక్షన్‌లకు పిలిచినా వెళ్లలేదు. ఇంట్లోనే కాలాన్ని వెల్లదీస్తున్నారు. పలు మత గ్రంథాలు చదువుతూ కాలాన్ని వెళ‌్లదీస్తున్నారు. అయితే గత కొంత కాలంగా మణి ఆరోగ్యం దెబ్బతినడంతో భర్త సూరిబాబు హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి విశ్వప్రయత్నాలు చేశాడు. అయినా వినిపించుకోని మణి ఎంత ఇబ్బందిపడినా ఇంటి గుమ్మం దాటలేదు. ఇక చేసేదేమి లేక సూరిబాబు స్థానికంగా ఉన్న పీహెచ్‌సీలో ఈ విషయాన్ని తెలిపాడు. దీంతో పీహెచ్‌సీ సిబ్బంది సూరిబాబు ఇంటికి వెళ్లి మణి, దుర్గలకు వైద్యం అందించే ప్రయత్నం చేయగా వీరిద్దరూ వారిని తమ గదిలోకి అనుమతించలేదు. ఏవేవో పిచ్చిమాటలు మాట్లాడుతూ వచ్చారు. పరిస్థితిని గమనించిన ఇంటిపక్కని వారు, గ్రమస్థులు, పంచాయతీ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వారిని ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చేందుకు తులుపు పగలగొట్టాల్సి వచ్చింది. అనంతరం ఆంబులెన్స్‌లో వారిద్దరిని కాకినాడ హాస్పటిల్ కి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.