ప్రముఖ హిందీ నటుడు అజయ్ దేవగన్ భార్య, నటి అయిన కాజోల్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అది కూడా సాంఘీక మాధ్యమంలో పోస్ట్ చేసింది. ఆమె ఒక విచిత్రమైన అర్థం ధ్వనించేలా వచ్చేట్టు రాసిన ఒక వాక్యం పోస్ట్ చేసి సాంఘీక మాధ్యమం నుండి కొన్నాళ్ల పాటు దూరంగా వుంటాను అని పెట్టింది. ఇది చూసిన ఆమె అభిమానులు అందరూ షాకింగ్ లో వున్నారు. ఏమైంది అని ఆమెకి ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఆమె పెట్టిన ఆ ఇంగ్లీష్ పోస్ట్ కి పక్క తెలుగు అనువాదం ఇది. “నా జీవితంలో కష్టతరమైన పరీక్షల్లో ఒకటి ఎదుర్కొంటున్నాను”, అని ఆమె పెట్టింది. . ఇక్కడ ఇంకో విషయం కూడా వుంది. ఆమె ఒక వెబ్ సిరీస్ లో నటించింది, దాని పేరు ‘ది ట్రయల్’ , అలాగే అదే పేరు వచ్చేట్టు ఆ పోస్ట్ కూడా పెట్టింది. అయితే ఆమెకి వ్యక్తిగతంగా ఏమైనా సమస్య వచ్చిందా, లేక పరిశ్రమ నుండి ఏదైనా సమస్య వచ్చిందా అన్న విషయం మాత్రం తెలీదు, ఆమె చెప్పలేదు కూడా.
కొందరు ఏమంటున్నారు అంటే, ఆమె ఒక షో చేస్తోంది అని, దాని పేరు ‘ది గుడ్ వైఫ్’ అని, దాని ప్రొమోషన్ లో భాగంగానే ఈ పోస్ట్ పెట్టిందని అంటున్నారు. ఎందుకంటే ఆ వెబ్ షో దర్శకుడు పి మల్హోత్రా ఈమె పోస్ట్ కి రిప్లై ఇస్తూ ఎప్పుడు ది గుడ్ వైఫ్ ట్రైలర్ వస్తోంది అని అడిగాడు. అందుకని ఆ షో ప్రచారంలో భాగంగానే ఇలా చేసిందేమో అని అంటున్నారు.