Kajal Aggarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ భర్తతో కలిసి నిన్న తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామినీ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో ఫ్యామిలీతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలకగా.. అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించారు. అనంతరం శ్రీవారి ప్రసాదాన్ని పండితులు అందించడం జరిగింది. అనంతరం ఆలయ ఆవరణంలో మీడియాతో కాజల్ అగర్వాల్ మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా తన భర్తతో కలిసి ఫస్ట్ టైం శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. కాజల్ అగర్వాల్ లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు ఆపేసింది.
ఆ తర్వాత ఒక బాబుకు జన్మనివ్వడం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ ఇటీవల గుర్రం స్వారీ చేస్తూ కత్తితో.. రకరకాల ఫీట్లు చేస్తూ మళ్ళీ వర్కౌట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పరిణామంతో మళ్లీ కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీలోకి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ లో ఐటెం సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ నీ సంప్రదించినట్లు ఆమె కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
“పుష్ప” మొదటి భాగంలో సమంత ఐటెం సాంగ్ చేయడం జరిగింది. ఆ పాట ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. సమంతకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో రెండో భాగం పుష్పాలు ఐటెం సాంగ్ చేయడానికి గాజల్ ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత మీడియా ముందుకు కాజల్ అగర్వాల్ భర్తతో కలిసి తిరుమలలో కనిపించడంతో ఆమె అభిమానులు ఫుల్ సంతోషంగా ఉన్నారు.