Kajal aggarwal: టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ గా పేరు పొందిన భామ కాజల్ అగర్వాల్. తన లెగ్ ఎంట్రీతో.. చిన్న పెద్ద హీరోలకు, డైరెక్టర్లకు మంచి హిట్స్ అందించింది ఈ సుందరి. తన అందం తనకే సొంతం. తన సోయగాలు ఇతరులతో పోలికకు ఏమాత్రం తూగవు. అయితే ఏ హెరొఇన్ ను అయినా కొన్ని రోజులు మర్చిపోయే జనాలు కాజల్ వంటి హీరోయిన్లను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు.
సరైన సమయంలో పెళ్లి.
చాలా మంది హీరోయిన్లు స్టార్ డమ్ ని ఆస్వాదిస్తూ.. పెళ్ళికి దూరంగా ఉంటారు. పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గుతయనేది దీనికి ఒక కారణం అయితే.. పెళ్లి తర్వాత ఇంట్లో కూడా నిబంధనలు ఉంటాయనేది దీనికి టెండవ కారణం. కానీ కాజల్ మాత్రం ఎంత స్టార్ హోదా ఉన్నప్పటికి సరైన సమయంలో వివాహం చేసుకుంది. తన చిన్ననాటి స్నేహితుడు ఐన గౌతమ్ కిచ్లు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కాజు బేబీ.
పెళ్లితో పాటు, పిల్లల విషయంలోనూ అన్నీ సమయానికే కానిచ్చింది కాజల్. అయితే కాజల్ ఇటీవల బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక తన పెళ్ళికి ముందు టాలీవుడ్ ని షేక్ చేసిన ఈ టాలీవుడ్ అందాల చందమామ. పెళ్లి తర్వాత సినిమా షూటింగ్ ల విషయంలో చాలా కండిషన్స్ ఎదుర్కొంటుందట. టాలీవుడ్ ని షేక్ చేసిన కాజు.. తన అందాల ఆరబోతపై ఇంట్లో రెస్ట్రిక్షన్స్ పెట్టారట.
Kajal aggarwal:
సినిమాలు, షూటింగ్ లకు వెళ్లొచ్చు కానీ లిప్ లాక్ లు, రొమాన్స్ సీన్ లు, వల్గర్ రోల్స్ కి దూరంగా ఉండాలని ఇంట్లో కండిషన్స్ పెట్టారంట. గౌతమ్ తో పాటు, తన అత్తమామలు కూడా ఈ విషయంలో ఇలాంటి నిబంధనలే పెట్టినట్టు టాక్. అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ ను కాజు బేబీ ఎలా చేస్తుందో.. ఎలాంటి కథలు, పత్రాలు పోషిస్తుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.