టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి కాజల్ అగర్వాల్. ఈ అమ్మడు రెండేళ్ల క్రితం తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక కరోనా కాల్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా సినిమాలు ఏమీ లేకపోవడంతో ఇంటికే పరిమితం అయిన కాజల్ అగర్వాల్ కొన్ని సినిమా ఆఫర్స్ కూడా వదులుకుడుంది. ఈ సమయంలో తన మొదటి ప్రాధాన్యత ఫ్యామిలీ అని చెప్పి సినిమాలకి దూరంగా ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి దగ్గరగానే ఉంది. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత చాలా వేగంగా గర్భవతి అయిన కాజల్ అగర్వాల్ రీసెంట్ గా పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
బిడ్డ పుట్టాక కాజల్ ఆనందం రెట్టింపు అయ్యింది. తల్లిప్రేమని ఆశ్వాదిస్తూ దానిని ప్రపంచానికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం దర్శకుడు శంకర్ ఇండియన్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో కాజల్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ కావడంతో ఆమెని రీప్లేస్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో ఆమె తన కొడుకుతో కలిసి షూటింగ్ లో పాల్గొనడానికి వెళ్తున్నట్లు తెలుస్తుంది.
కొడుకుని చూసుకోకుండా క్షణం కూడా కాజల్ ఉండలేకపోతుందని ఈ నేపధ్యంలో షూటింగ్ స్పాట్ కి కొడుకుని తీసుకొచ్చిందని చెన్నై సర్కిల్ లో వినిపిస్తుంది. అయితే కొడుకుని హోటల్ గదిలోనే ఉంచి షూటింగ్ కి హాజరవుతుందని సమాచారం. ఇక ఈ సినిమా పూర్తి చేసి కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాలలో బిజీ అవ్వాలని కాజల్ అగర్వాల్ భావిస్తున్నట్లు టాక్. అందరిలా తన సీక్రెట్స్ ని దాచే ప్రయత్నం చేయకుండా ఆమె ఓపెన్ గా ఉండటంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు అయితే లభించే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.