సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ ప్రస్తుతం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా బజ్ ఉంది. పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా బన్నీ సెన్సేషన్ అయిపోయాడు. ఈ సినిమాలో ఊ అంటావా సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో. నా సామి సాంగ్ కూడా అంతే హిట్ అయ్యింది. శ్రీవల్లి సాంగ్ అందులో బన్నీ డాన్స్ మూమెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. అలాగే సినిమాలో పుష్ప మ్యానరిజం తగ్గేదిలే అనేది కూడా ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యింది. విదేశీయులు సైతం ఆ మ్యానరిజమ్ యూజ్ చేస్తూ తగ్గేదిలే అనే చెబుతూ ఉండటం గమనార్హం.
ఇదిలా ఉంటే పుష్ప కి మించి ఈ సెకండ్ పార్ట్ ఉండే విధంగా సుకుమార్ కథని సిద్ధం చేశాడు. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. మొదటి సినిమాకి రెట్టింపు బడ్జెట్ ఈ మూవీ కోసం మైత్రీ మేకర్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కూడా ఐటెం సాంగ్ ఉంటుందని ఆ సాంగ్ లో మలైకా అరోరా నటిస్తుందని మొన్నటి వరకు ప్రచారం నడిచింది.
అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లోకి కాజల్ అగర్వాల్ వచ్చి చేరినట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఇప్పుడు మరోసారి ఊ అంటావా తరహాలో సమంతని మించిపోయే ఐటెం బీట్స్ చేయడానికి సిద్ధం అయినట్లు టాక్. ఆమె కూడా సాంగ్ లో కనిపించడానికి చాలా ఇంటరెస్ట్ చూపిస్తుందని సమాచారం. రీసెంట్ గా తల్లి అయినా కాజల్ మళ్ళీ ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టి కసరత్తులు చేస్తుంది. ఈ నేపధ్యంలో ఆమె పుష్ప 2లో ఐటెం సాంగ్ పక్కా అనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఇండియా 2 మూవీలో నటిస్తుంది.