Kajal Agarwal : కాజల్ అగర్వాల్ వైట్ ఎత్నిక్ లుక్‌తో అందరిని మంత్రముగ్ధులను చేస్తోంది. ఇటీవలి చేసిన ఓ ఫోటో షూట్ కోసం, కాజల్ ఫ్యాషన్ బ్రాండ్ ఫాబియానా షెల్ఫ్ నుండి చికంకారీ సూట్ సెట్ ను ఎన్నుకుని ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది.

Kajal Agarwal : గోల్డెన్ జరీ వర్క్, బటన్ డీటెయిల్స్, వీ నెక్‌లైన్‌తో వచ్చిన ఈ లాంగ్ కుర్తాకు మ్యాచింగ్ గా స్ట్రయిట్ ఫిట్ ప్యాంట్ వేసుకుని ఎంతో క్యూట్ గా కనిపించింది కాజల్. లాంగ్ కుర్తాకు మ్యాచింగ్ గా వైట్ డిజైనర్ దుపట్టాను ధరించి దేవకన్యలా మెరిసింది.

ఈ ఎత్నిక్ వేర్ కు మ్యాచ్ అయ్యేలా చెవులకు రెడ్ స్టోన్స్ తో డిజైన్ చేసిన లాంగ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ , చేతి వేళ్ళకు డైమండ్ ఉంగరాలు పెట్టుకుంది.

కనులకు బ్రౌన్ ఐ ష్యాడో , పేదలకు పింక్ లిప్ స్టిక్ పెట్టుకుని ఎంతో కూల్ గా కవ్వించింది. ఫేమస్ స్టైలిస్ట్ జుకల్కర్ కాజల్ కు స్టైలిష్ లుక్స్ ను అందించాడు. విశాల్ కాజల్ అందానికి మెరుగులు దిద్దాడు.

రీసెంట్ గా చేసిన ఓ ఫోటో షూట్ లో పాయల్ ఖండ్వాలా ఎత్నిక్ కలెక్షన్ లో కాజల్ అగర్వాల్ అద్భుతంగా కనిపించింది. గ్రీన్, పింక్ ఫ్లోరల్ ప్రింట్స్ తో ఉన్న బ్రౌన్ కలర్ డ్రెస్ లో హాట్ పోజులు ఇచ్చి కుర్రాళ్లను ఆకర్షించింది. డీప్ వీ నెక్ లైన్ తో వచ్చిన ఈ అవుట్ ఫిట్ లో కాస్త ఎక్స్ పోసింగ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.

అంతకు ముందు పసుపు రంగు అనార్కలి సూట్ వేసుకుని ఎప్పటిలాగే మనోహరంగా కనిపించింది ఈ చందమామ . ఫుల్ స్లీవ్ స్క్వేర్ కట్ నెక్‌లైన్ ,పై నుండి క్రింది వరకు భారీ ఎంబ్రాయిడరీతో వచ్చిన ఈ సెట్ లో మెరిసింది. ఈ అనార్కలికి మ్యాచింగ్ గా సమె ప్యాట్రన్స్ తో ఉన్న హెవీ దుపట్టాను వేసుకుని తళుక్కుమంది.
