టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నాలుగు నెలల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ భామ బిడ్డ సంరక్షణలోనే గడిపింది. అయితే ఈ అందాల తార తిరిగి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న ఓ వీడియోను ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాకుండా తన బాడీ షేమింగ్‌పై ఊహించని కామెంట్స్ చేసింది.
‘ప్రసవం అయిన నాలుగు నెలల తర్వాత నేను షూటింగ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను. నా శరీరం గతంలో ఉన్నట్లుగా ఇపుడు ఉంటుందని అనుకోవడం లేదు. బాబు పుట్టినప్పటి నుంచి నేను పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాను. చాలా రోజుల తర్వాత ఇటీవలే జిమ్‌కు వెళ్లాను. అప్పటిలా నా శరీరానికి ఎనర్జీ లెవల్స్ పొందడం చాలా కష్టంగా ఉంది. గతంలో గుర్రపు స్వారీ ఈజీగా చేసాను. కానీ అదే పని ఇప్పుడు చాలా కష్టంగా అనిపించింది. మన శరీరంలో మార్పులు రావచ్చు కానీ మనకున్న ఆత్మవిశ్వాసం, అభిరుచుల ముందు ఏదీ కష్టం కాదు. మనం ప్రతి రోజు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ ముందు చూపుతో వ్యవహరించాలి. కావాలనుకున్న దానిపైనే దృషి పెట్టాలి’’ అంటూ చెప్పుకొచ్చారు.
‘భారతీయుడు 2 సినిమాలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను కొత్త నైపుణ్యాలను నేర్చుకుని వాటిని అలవాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. ఈ చిత్రంలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిరంతరం నేర్చుకోవాలనిపించేలా అవకాశాలు వస్తున్నాయి. ధన్యవాదాలు’ అని అన్నారు.