Kajal Agarwal: తెలుగులో దాదాపు అందరూ టాప్ హీరోలతో సినిమాలు చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. చందమామ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడగు పెట్టిన ఈ అమ్మడికి.. రామ్ చరణ్ తేజ్ తో తీసిన మగధీర సినిమా స్టార్ హీరోయిన్ ను చేసింది. ఆ తర్వాత తెలుగులోని టాప్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా చేసిన కాజల్ అగర్వాల్.. పెళ్లి చేసుకొని, ఓ బిడ్డకు జన్మనివ్వడం తెలిసిందే.
తన ఫ్రెండ్స్, బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తన బిడ్డకు ఆరు నెలలు నిండిన సందర్భంలో.. పిల్లోడి ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన ఇన్ స్టాగ్రామ్ లో కొడుకు నీల్ ఫోటోను పెట్టిన కాజల్ అగర్వాల్.. ఎంతో ఎమోషనల్ గా రాసుకొచ్చింది.
ఇంతకీ ఏమని పోస్ట్ చేసిందంటే..
కాజల్ తన ఇన్ స్టాగ్రామ్ లో కొడుకు నీల్ ఫోటో పెట్టి ఇలా రాసుకొచ్చింది.. ‘నువ్వు పుట్టి అప్పుడే 6 నెలలు పూర్తయ్యింది. కాలం ఎంతో తొందరంగా గడిచిపోయింది. ఒక యంగ్ మదర్ గా నీ విషయంలో నేను ముందు భయపడ్డాను. ఒక తల్లిగా నా కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించగలనా లేదా అనుకున్నాను.ఇప్పటికీ గొప్ప తల్లిని ఎలా అవ్వాలో నేర్చుకుంటూనే ఉన్నాను.
నాకు ఎన్ని పనులు ఉన్నా.. నీ కోసం నా సమయాన్ని ఎప్పుడూ కేటాయిస్తూనే ఉంటాను.. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నీపై శ్రద్ద చూపడంలో నేను ఎక్కడా రాజీపడను. ఇది నాకు సవాలుతో కూడుకున్నదే అయినా.. నేను పొందే ఆనందం ముందు ఆ సవాలు చిన్నదే అనిపిస్తుంది. నువ్వు రాత్రిపూట చేసే అల్లరి నాకు సంతోషాన్ని ఇస్తుంది. నీ గురించి మీ నాన్న నేను సరదాగా మాట్లాడుకుంటాం. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను. నీకు జన్మనిచ్చే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. తల్లిగా చేసే బాధ్యత గొప్పదని అంటారు. నువ్వు పుట్టి ఏడాది కావడానికి ఇంకా సగం దూరం ఉంది. మై లవ్..మై నీల్..’ అని పెట్టింది.
Kajal Agarwal:
కాగా కాజల్ అగర్వాల్ కొడుకు ఫోటోకు ఇచ్చిన పోజ్ చూసిన జనాలు మాత్రం.. ఇప్పుడే బుడ్డోడు కెమెరాకు రెడీ అయిపోయాడని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు కెమెరా భయం అనే వీడి రక్తంలోనే లేనట్లుంది, ఏం పోజులిస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram