ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్.. ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లిగా నటిస్తుండగా.. ఆమెకు భర్త పాత్రలో హీరో సుశాంత్ నటిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన ఈయన మొదట్లో అడ్డా, కాళిదాసు, కరెంట్ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆనందింప చేసారు . ఆ తరువాత వరుస పరాజయాలు రావడంతో కొన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో మొదలుపెట్టిన ఈయన ఇటీవల మా నీళ్ల ట్యాంక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .

ఒక వైపు సినిమాలలో హీరోగా చేస్తూనే.. మరొక వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలకపాత్రలు పోషిస్తున్నాడు . ఇదిలా ఉండగా ఈ సినిమాలో కీర్తి సురేష్ సరసన సుశాంత్ నటిస్తుండగా.. తమన్నా సుశాంత్ కి సోదరి వరుస పాత్ర చేస్తూ ఉండడం ఇప్పుడు పలు సంచలనాలకు దారితీసింది. వాస్తవానికి కాళిదాసు సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించినా.. అప్పట్లో వీళ్లిద్దరి మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి . అయితే ఇప్పుడు మాత్రం సుశాంత్ కి సిస్టర్ గ నటిస్తుంది తమన్నా.
ఒకానొక సమయంలో యంగ్ హీరో సుశాంత్ పక్కన హీరోయిన్ గా నటించిన ఈమె ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరు పక్కన హీరోయిన్ గా నటిస్తూ ఉండడంతో ఆమె కి డిమాండ్ బాగా పెరిగిపోయిందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. నిజానికీ హీరో హీరోయిన్స్ గా చేసిన నటులు మళ్లీ సోదరీ సోదరీమణులుగా చేయడం అనేది ఇదేమి కొత్త కాదు వాళ్ళకి .. గతంలో కూడా ఎన్టీఆర్, సావిత్రి ఇలాగే చాలా సినిమాలలో నటించారు. ఇక చిరంజీవి, నయనతార కూడా సైరా నరసింహారెడ్డిలో భార్యాభర్తలుగా నటించి .. గాడ్ ఫాదర్ సినిమాలో అన్నా చెల్లెలుగా నటించిన విషయం అందరికి తెలిసిందే .