ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఏ మాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. గత రాత్రి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఫ్యామిలీతో దేవర దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర అనే తన రాబోయే ప్రాజెక్ట్ చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నాడు. ఈ సహకారం వారి చిత్రం జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత వారి కలయికను సూచిస్తుంది. ఈ తారాగణంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. మ్యూజిక్ కంపోజర్‌గా అనిరుధ్ రవిచందర్ ఎంపికయ్యారు.

ఫ్యామిలీతో జూనియర్ ఎన్టీఆర్ వెకేషన్ ట్రిప్
హాలిడే ట్రిప్ కోసం ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చారు. తన భార్య లక్ష్మి ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి వేసవిలో చిల్ కావడానికి మరో ఫారెన్ ట్రిప్ బయల్దేరారు ఎన్టీఆర్. అయితే ఇది షార్ట్ వెకేషన్ ట్రిప్ అని, వారం రోజుల్లోనే ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం.
మొదట ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో షురూ చేసి రీసెంట్ గానే ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు కొరటాల. ఈ టైటిల్ పోస్టర్ చూసి నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. మరోసారి ఎన్టీఆర్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపించనుండటంతో ఎంతో ఆతృతగా ఉన్నారు.