Jr NTR :ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్స్‌లో పెద్ద విజయాన్ని సాధించింది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును అందుకుంది. గోల్డెన్ గ్లోబ్స్‌లో కీలకమైన విజయాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఈ ఇంటర్వ్యూ లో చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయాన్ని సాధించిన విషయాలతో పాటు మూవీ లో మొత్తం ప్రయాణం ఎంత అద్భుతంగా సాగిందో వంటి విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడాడు. ఆర్ఆర్ఆర్ భారతదేశం కంటే జపాన్ ఎక్కువ ప్రేమను ఇచ్చిందని తాను భావిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

గోల్డ్‌డెర్‌బీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ చిత్రం ప్రపంచవ్యాప్త దృష్టిని అందుకోవడం గురించి నటుడిని అడిగినప్పుడు, అతను ఇలా అన్నాడు, “నేను జపాన్‌లో ఉన్నాను, ఈ సినిమా చూసి ప్రజలు ఏడవడాన్ని చూశాను, వారు ప్రేక్షకులుగా RRR పట్ల తమ ప్రేమను వ్యక్తం చేశారని నేను భావిస్తున్నాను, భారతదేశం చేయగలిగిన దానికంటే ఎక్కువ, పాశ్చాత్య దేశాలు సోషల్ మీడియాలో RRR గురించి మాట్లాడుతున్నాయని అన్నారు.

జపాన్‌లో RRR యొక్క రికార్డ్-బ్రేకింగ్ నంబర్‌ల గురించి ఎన్టీఆర్ మాట్లాడారు. జపాన్ లో సినిమా రిలీజ్ అయిన ప్రారంభ వారాంతంలో 35 యెన్ మిలియన్ల కలెక్షన్స్ వచ్చాయన్నారు. జపనీస్ బాక్సాఫీస్ వద్ద, ఈ చిత్రం దాదాపు 403 యెన్ మిలియన్ కలెక్షన్స్ రాబట్టింది. రజనీకాంత్ నటించిన ముత్తును అధిగమించి అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ నిలిచింది. 80వ గోల్డెన్ గ్లోబ్స్ రెడ్ కార్పెట్ వద్ద తమ అనుభూతి ఎంత అద్భుతంగా ఉందో జూనియర్ ఎన్టీఆర్ కూడా వ్యక్తం చేశారు.