Jr NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గ్లోబ్స్ రెడ్ కార్పెట్‌పై తన యాసపై విమర్శలను పరోక్షంగా తిప్పికొట్టారు. ఇటీవలి ఇంటర్వ్యూలో, ఎన్టీఆర్ మాట్లాడిన మాటలను ‘ఫేక్’ అని పిలిచే ట్రోల్స్‌కు పరోక్షంగా గట్టి సమాధానం చెప్పాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే డ్యాన్స్ మూవ్స్ అందించిన నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్‌ను గెలుచుకున్న సక్సెస్‌ను ఫుల్‌లెన్త్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు.

80వ గోల్డెన్ గ్లోబ్స్ సందర్భంగా, RRR బృందం రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. అక్కడి మీడియా ఈ టీమ్ ను అడిగిన కొన్ని ప్రశ్నలకు అద్భుతంగా సమాధానమిచ్చారు. ఈ చిత్రం గురించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, రాజమౌళి ట్రాక్ రికార్డ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, మేము భారత్‌లో ఖచ్చితంగా విజేతగా నిలుస్తామని అనుకున్నామన్నారు. కానీ ఆర్‌ఆర్‌ఆర్ మొన్న జపాన్‌లో నేడు అమెరికాలోనూ విజేతగా నిలిచిందని, ఇలా జరుగుతుందని మేము అస్సలు ఊహించలేదన్నారు.

ఎన్టీఆర్ మాట్లాడిని ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే, ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోపై రెండు రకాల వాదనలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ యాసపై కొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేయగా, అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. గోల్డెన్ గ్లోబ్స్ కంటే ముందు, లాస్ ఏంజిల్స్ ఐకానిక్ లోని TCL, చైనీస్ థియేటర్ IMAX స్క్రీనింగ్‌లో, RRR టిక్కెట్లు 98 సెకన్లలో అమ్ముడయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ లాస్‌ఏంజిల్స్ టైమ్స్ వార్తాపత్రికతో మాట్లాడుతూ ఈ రిసెప్షన్ మాగీని వండడం కంటే వేగంగా టికెట్లను అమ్మిందని అన్నారు. దర్శకుడు రాజమౌళి అతని దూర దృష్టిని ప్రశంసించాడు. రాజమౌళి కేవలం తెలుగులో లేదా భారతదేశంలో మాత్రమే సినిమాలు చేయడానికి పుట్టలేదని ఆయన పరిధి మరింత విస్తరించాలని నేను ఎప్పుడూ భావిస్తానని అన్నాడు. ప్రతి చిత్రంతో, రాజమౌళి మరింత అప్‌డేటెడ్ వర్షన్‌తో ముందుకు వస్తాడన్నాడు ఎన్టీఆర్. దక్షిణ భారతదేశంలో టాలీవుడ్ ఓ చిన్న చిత్ర పరిశ్రమను RRR అనే ఒక సినిమా గ్లోబల్ స్థాయికి చేర్చడం నిజంగా గర్వించదగ్గ విషయం అని పొగడ్తలతో ముంచెత్తారు.

అదే సంభాషణలో, జూనియర్ ఎన్టీఆర్ తన యాస గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ, మనమంతా కేవలం టైమ్ జోన్‌లుగా , కొంచెం యాసతో విభజించబడ్డాము కానీ పాశ్చాత్య దేశాలలో ఒక నటుడు ఏ విధంగా ఉంటాడో తూర్పులోనూ అదే విధంగా ఉంటాడని అన్నాడు. ఈ దెబ్బతో నెగిటివ్ ట్రోలర్స్‌కు మంచిగా చురకలు అంటించారు ఎన్టీఆర్.