NTR: ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలో ఒక ట్రెండ్ కొనసాగుతూ ఉంది. అదేమిటంటే తమ అభిమాన హీరోకి సంబంధించిన పుట్టినరోజు లేదా సినిమా విడుదలయ్యి కొన్ని సంవత్సరాలు కావస్తున్న క్రమంలో.. సదరు హీరో బ్లాక్ బస్టర్ సినిమాను రీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ ట్రెండ్ సృష్టించింది మహేష్ బాబు ఫ్యాన్స్. ఈ ఏడాది ఆగస్టు 9వ తారీకు మహేష్ పుట్టిన రోజు నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో… “ఒక్కడు”, “పోకిరి” సినిమాలను రీ రిలీజ్ చేయడం జరిగింది. కలెక్షన్స్ ఊహించని విధంగా వచ్చాయి.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు “ఘరానా మొగుడు” రీ రిలీజ్ చేశారు. అనంతరం సెప్టెంబర్ రెండవ తారీకు పవన్ పుట్టినరోజు “జల్సా” రీ రిలీజ్ చేసి రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టారు. ఇక రీసెంట్ గా వివి వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన “చెన్నకేశవరెడ్డి” విడుదలై 20 సంవత్సరాలు కావడంతో మళ్లీ రీ రిలీజ్ చేయడం జరిగింది. రీ రిలీజ్ లో కూడా “చెన్నకేశవరెడ్డి” మరోసారి రికార్డులు సృష్టించింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన “ఆది” సినిమాని రీ రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయింది. “ఆది” విడుదలయ్యి 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో.. నవంబర్ మూడో వారంలో మళ్లీ విడుదల చేస్తున్నారు. దీంతో మరోసారి తారక్ తొడ కొట్టనున్నట్లు తెలుస్తోంది. తారక్ టీనేజ్ వయసులో.. వచ్చిన “ఆది” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. నటుడిగా ఇప్పుడు ఎన్నో మైళ్ళు రాళ్లు అందుకున్న క్రమంలో మరోసారి ఈ సినిమా రిలీజ్ కావటం అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.