మంచు విష్ణు హీరోగా జిన్నా టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తనకి అలవాటైన కామెడీ, కమర్షియల్ ఎంటెర్టైనెర్ కథాంశంతోనే జిన్నా సినిమాని విష్ణు చేస్తున్నాడు. ఈ సినిమాపై పెద్ద బజ్ అయితే లేదు. దానికి తోడు అక్టోబర్ 5న సినిమా విడుదల ఉంటుందని ఎనౌన్స్ చేశారు. అదే రోజు చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో పాటు, నాగార్జున ఘోస్ట్ మూవీ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. అలాగే మెజారిటీ థియేటర్స్ ని ఈ రెండు సినిమాలు ఆక్యుపై చేసేస్తున్నాయి. గాడ్ ఫాదర్ మీద విపరీతమైన బజ్ ఉంది. దసరా బరిలో కచ్చితంగా మెజారిటీ ఆడియన్స్ ఆ మూవీని చూడటానికి ఇష్టపడతారు. ఇక సెకండ్ అప్సన్ గా ఘోస్ట్ చూస్తారు.
ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా నాగార్జున ఇమేజ్ తో ఆ మూవీకి కూడా క్యూ కడతారు. వీటిని తట్టుకొని ఇంకా ఏ సినిమా వచ్చిన నిలబడే అవకాశం ఉండదు. ఒక వేళ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కచ్చితంగా కలెక్షన్స్ రావనే చెప్పాలి. చిన్న సినిమాలని గాడ్ ఫాదర్ మూవీ హైజాక్ చేస్తుంది. అయితే ఈ రెండు సినిమాలకి పోటీగా మంచు విష్ణు తన సినిమాని రిలీజ్ చేయాలని ముందు నుంచి భావించాడు. అయితే నిర్మాతల నుంచి వచ్చిన ఒత్తిడితో వెనక్కి తగ్గక తప్పలేదు. దసరా బరినుంచి జిన్నా సినిమా తప్పుకుంటుంది అని చెప్పారు.
కొన్ని అనివార్య కారణాల వలన అక్టోబర్ 5న సినిమాని రిలీజ్ చేయడం లేదని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. అక్టోబర్ 21న తమ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. దీంతో గాడ్ ఫాదర్ ఎఫెక్ట్ తోనే మంచు విష్ణు రిలీజ్ ని వాయిదా వేసుకున్నాడనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. ఆ విషయాన్ని మంచు విష్ణు ఒప్పుకోకున్నా వాస్తవం అదే అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇక ఈ సినిమా మీద విష్ణు చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అలాగే కచ్చితంగా ఈ సారి హిట్ కొడుతున్నాం అంటూ గతంలోనే చెప్పాడు. ఈ మూవీలో సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ ఉండటంతో గ్లామర్ డోస్ ఎక్కువగా ఉంటుందని ఆడియన్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.