Janvi Kapoor : రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరు జారింది. అంతే ఆ మాట జనాలను నోరెళ్లబెట్టేలా చేసింది. ఇంతకీ జాన్వి ఏమన్నది? ఆ మాటకూ టైటిల్ చెప్పుకున్నట్టు విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లితో లింకేంటి? అనుకుంటున్నారా? ఇటీవల బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటించిన ‘గుడ్ లక్ జెర్రీ’ మూవీ విడుదలైంది. కానీ.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఇక ఆ తరువాతి అమ్మడు ‘మిలీ’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాపై జాన్వి గంపెడు ఆశలు పెట్టుకుంది.
ప్రస్తుతం అమ్మడు ఆ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తోంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది. ఓ ఇంటర్వ్యూలో స్వయం వరం గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది జాన్వీ. మీకు స్వయం వరం జరిగితే? ఏ హీరోలు వస్తే బాగుంటుంది? అని యాంకర్ అడగ్గా.. హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, టైగర్ ష్రాప్ పేర్లను చకచకా చెప్పేసింది. అయితే వీరిలో హృతిక్, రణబీర్‌కి ఇప్పటికే పెళ్లి అయిపోయింది కదా అని యాంకర్ అడగడంతో పాటు ఇటీవలే ‘లైగర్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించింది.
అయితే తన స్వయంవరానికి విజయ్ దేవరకొండ మాత్రం వద్దని చెప్పడమే కాకుండా.. అతనికి ప్రాక్టికల్‌గా పెళ్లైపోయిందని చెప్పి నాలుక కరుచుకుంది జాన్వీ. ఇక నెటిజన్లు ఆగుతారా? విజయ్‌కు ఆ ప్రాక్టికల్ పెళ్లి మరెవరితోనో కాదని.. రష్మికతోనేననే ప్రచారం ప్రారంభించారు. నాలుగేళ్లుగా ఈ జంట డేటింగ్‌లో ఉందనే ప్రచారం ఇప్పటికే జరుగుతుండటంతో.. ఇప్పుడు జాన్వీ మాటతో పెళ్లి కూడా అయిపోయిందని తేలిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ జంట ఏమైనా తక్కువ తిన్నదా? తాము కేవలం స్నేహితులమేనని చెబుతూ మాల్దీవులు ట్రిప్‌కి వెళ్లింది. ఎయిర్‌పోర్టులో ఇద్దరూ పట్టుబడటం పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన విషయం తెలిసిందే కదా.