Jenelia: తెలుగుతో పాటు దక్షిణాది సినిమాల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ జెనీలియా. బొమ్మరిల్లు సినిమాలో హహ హాసినిగా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన జెనీలియా.. ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమైంది. కాగా ఈ హీరోయిన్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. ఈ హీరోయిన్ కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వార్త ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతోంది.
హీరోయిన్ జెనీలియా.. సుమంత్ హీరోగా చేసిన ‘సత్యం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత తమిళం, కన్నడ, మళయాలం, మరాఠీ, హిందీ భాషలలో వరుసగా సినిమాలు చేసింది. అయితే తెలుగులో మంచి సినిమాలు దక్కించుకుంటున్న టైంలోనే ఓ హీరో కొడుకుతో జెనీలియా ఎంతో క్లోజ్ గా ఉండిందట. వారిద్దరి గురించి ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకునేంతలా ఉండేవారట.
అయితే ఆ స్టార్ కొడుకు జెనీలియా పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఏకంగా చేయి చేసుకున్నట్లు గుసగుసలు కూడా వినిపించాయి. ఆ తర్వాత తెలుగులో మెల్లిగా సినిమాలు తగ్గించేసిన జెనీలియా.. చివరకు తెలుగులో సినిమాలు చేయడమే మానేసిందట. కాగా సదరు స్టార్ కొడుకు జెనీలియాను వాడుకొని వదిలేసినట్లు కొంతమంది సినీ ఇండస్ట్రీ చెవులు కొరుక్కుంటున్నారు.
Jenelia:
కాగా హీరోయిన్ జెనీలియా.. హిందీ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకొని పిల్లలతో సంతోషంగా గడుపుతోంది. చాలాకాలం పాటు సినిమాలు మానేసిన జెనీలియా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అయిపోయింది. అందులో భాగంగానే ఓ ప్రముఖ హీరో సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.