Japan : జపాన్ దేశంలో గ్రామీణ ప్రాంతాలలో వేగవంగా తగ్గుముఖం పడుతున్న జనాభాను పెంచేందుకు జపాన్ ఈ సంవత్సరం టోక్యో నుండి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి అంగీకరించే ఒక బిడ్డ కుటుంబాలకు 1 మిలియన్ యెన్ చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం, ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం టోక్యో ప్రాంతాన్ని విడిచిపెడితే వారికి మద్దతుగా 3 మిలియన్ యెన్‌లు జపాన్ అందించనుంది . 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద 2027 నాటికి 10,000 మంది టోక్యో నుంచి గ్రామీణ ప్రాంతాలకు తరలివెళ్లారని ప్రభుత్వం భావిస్తోంది.

Japan : గతేడాది ప్రభుత్వం 1,184 కుటుంబాలను ఆదరించగా, 2020లో 290 మంది, 2019లో 71 మంది కుటుంబాలు ఈ లిస్ట్‌లో చేరాయి. కేంద్ర టోక్యో మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఐదు సంవత్సరాలు నివసించిన కుటుంబాలు మద్దతు నిధుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కేంద్ర ప్రభుత్వం , స్థానిక మున్సిపాలిటీలు నిధుల వ్యయాన్ని విభజించాయి. కుటుంబాలు స్థానిక ప్రాంతంలో వ్యాపారం ప్రారంభించాలనుకుంటే అదనపు మద్దతు కూడా అందించనుంది.

అయితే, 1 మిలియతో యెన్ తో అందమైన గ్రామీణ పట్టణానికి తరలించడానికి క్లెయిమ్ చేయడం అనుకున్నంత సులభం కాదు. మద్దతును పొందాలని ఆశించే కుటుంబాలు తప్పనిసరిగా కనీసం ఐదేళ్ల పాటు వారి కొత్త ఇళ్లలో నివసించాలి , ఇంటిలోని ఒక సభ్యుడు తప్పనిసరిగా పనిలో ఉండాలి లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేసుకోవాలి. ఐదేళ్లు నిండకముందే బయటకు వెళ్లేవారు నగదును తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.

జనాలను ఆకర్షించే ప్రయత్నంలో, జపాన్ పట్టణాలు , గ్రామాల ప్రయోజనాలు నిరంతరం హైలైట్ చేయబడుతున్నాయి. నగరాల్లో అవకాశాల కోసం ఎక్కువ మంది యువకులు పట్టణాలకు చేరుకుంటుండటం వల్ల ఇటీవలి సంవత్సరాలలో జపాన్ గ్రామీణ ప్రాంతాలు వేగంగా జనాభా తగ్గుముఖం పట్టింది. ఆకర్షణీయమైన మొత్తం ఈ ప్రాంతాలను పునరుజ్జీవం తీసుకువచ్చేందుకు కుటుంబాలను ప్రోత్సహించడంతో పాటు ,గ్రేటర్ టోక్యోలో స్థలం , ప్రజా సేవలపై ఒత్తిడిని తగ్గించాలని అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది.
Advertisement