Janhvi Kapoor : జాన్వీ కపూర్ రీసెంట్‌గా ముంబైలో తన అప్‌కమింగ్ మూవీ మిలి ట్రైలర్‌ను కోస్టార్స్ మనోజ్ పష్వా, సన్నీ కౌషల్‌తో కలిసి లాంచ్ చేసింది. ఈ ట్రైలర్ కు నెట్టింట్లో మంచి రెస్పాన్స్ రావడంతో జాన్వీ ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌లతో బిజీ బిజీగా ఉంటోంది. తాజాగా జాన్వీ కపూర్ ఓ ప్రమోషనల్ ఈవెంట్ కోసం జైపూర్‌కు వెళ్లింది. ఈవెంట్ కోసం అద్భుతమైన అవుట్‌ఫిట్‌ను వేసుకుని కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ డ్రెస్‌తో చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ ను జాన్వీ తన ఇన్‌ష్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Janhvi Kapoor : జైపూర్‌లో జరిగిన ఓ సంగీత కచేరీకి గెస్ట్‌గా హాజరైంది జాన్వీ కపూర్. ఈ కన్‌సర్ట్ కోసం జాన్వీ కపూర్ పింక్ కలర్ షరారా సెట్‌ను వేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కత్తితో కట్ చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. షరారా సెట్‌తో జాన్వీ దిగిన ఫోటోలను వరుస పెట్టి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి’ పింక్ ఇన్ పింక్ సిటీ ‘అని క్యాప్షన్‌ను జోడించింది. అదే విధంగా #జైపూర్ మే మిలీ అని హ్యాష్ ట్యాగ్‌లను జోడించింది. జాన్వీ నటించిన మిలీ చిత్రం నవంబర్ 4 వ తారీఖున థియేటర్స్‌లో విడుదల కానుంది.

జైపూర్‌లో జరిగిన ఈ ప్రమోషనల్ ఈవెంట్ కోసం జాన్వీ ముదురు గులాబీ రంగు డిజైనర్ అవుట్‌ఫిట్‌ను వేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ అవుట్‌ఫిట్‌ను డిజైన్ చేశారు. ఎత్నిక్ లుక్‌లో జాన్వీ అప్సరసలా మెరిసింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే మిలీ ప్రమోషనల్ ఈవెంట్ల కోసం జాన్వీ అన్ని రకాల ఎత్నిక్ అవుట్‌ఫిట్స్‌ను ధరిస్తూ ఫ్యాషన్‌తో ప్రయోగాలు చేస్తోంది.

స్పగెట్టీ స్ట్రాప్స్, ప్లంగింగ్ స్క్వేర్ నెక్‌లైన్, మిడ్‌రిఫ్ బేరింగ్, డోరీ ఎంబ్రాయిడరీతో వచ్చిన క్రాప్డ్ బ్లౌజ్ వేసుకుంది. దీనికి మ్యాచింగ్‌గా అదే రంగులో ఉన్న హై వెయిస్ట్‌లైన్, ఫ్లేర్డ్ హెమ్, డోరీ ఎంబ్రాయిడరీతో వచ్చిన షరారా ప్యాంట్ ధరించింది. స్లీవ్ లెస్ డ్రేప్ డీటైల్స్‌తో బార్డర్ల వద్ద పూల థ్రెడ్ వర్క్‌తో వచ్చిన రానీ పింక్ కలర్ జార్జెట్ కేప్ జ్యాకెట్ వేసుకుని తన ఎత్నిక్‌లుక్‌ను కంప్లీట్ చేసింది.

జాన్వీ ఈ షరారాకు మరింత అట్రాక్షన్‌ను జోడించేందుకు చెవులకు డ్యాంగ్లింగ్ ఇయర్‌రింగ్స్ పెట్టుకుంది. కనులకు షిమ్మరింగ్ పింక్ హ్యూడ్ స్మోకీ ఐ ష్యాడో , మస్కరా వేసుకుంది. పెదాలకు న్యూడ్ లిప్ షేడ్ పెట్టుకుని ఐ బ్రోస్‌ను డార్క్ చేసుకుని గ్లామరస్ లుక్స్‌తో యూత్‌ను ఫిదా చేసేసింది.
