Janhvi Kapoor : గత కొంత కాలంగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో తన అందాలతో దాడి చేస్తోంది. ఫెస్టివ్ పార్టీలని, మూవీ ప్రమోషన్‌లనీ ఇలా ఏ ఈవెంట్‌కు హాజరైనా అక్కడ హాట్ ఫోటోలను దిగుతూ వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌తో కనెక్టివిటీ మెయిన్‌టేన్ చేస్తోంది. ప్రస్తుతం త్వరలో రిలీజ్ కాబోతున్న మిలి చిత్రం ప్రమోషన్‌లో బిజీ బిజీగా గడుపుతోంది జాన్వీకపూర్. అందులో భాగంగా తాజాగా చేసిన ఓ హాట్ ఫోటో షూట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.

Janhvi Kapoor : జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ఇప్పటికే పలు సినిమాల్లో నటించినా తండ్రి బోనీకపూర్ ప్రొడ్యూజర్‌గా చేస్తున్న మొదటి సినిమా మిలి. రానున్న నవంబర్ నెల 4వ తారీఖున మిలీ సినిమా రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ప్రమోషన్ పనిలో పడిపోయింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా జాన్వీ కపూర్ ఆకుపచ్చ రంగులో వచ్చిన అత్యధ్భుతమైన చీరను కట్టుకుని తన సొగసులతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.

మిలీ ప్రమోషన్ ప్రారంభమైనప్పటి నుంచి విభిన్న రకాల డిజైన్స్‌ల ఎత్నిక్ అవుట్‌పిట్‌లను ధరించి తన అందాలను చూపిస్తోంది జాన్వీ కపూర్. చీరకట్టులోనూ సాంప్రదాయ లుక్‌లో కవ్విస్తోంది ఈ దేశీ గర్ల్. గ్రీన్ బ్యాక్‌డ్రాప్‌లో బ్లూ కలర్ ప్రింట్స్‌తో వచ్చిన ఈ చీరకు మ్యాచింగ్‌గా విభిన్న రంగుల ప్రింట్స్‌తో డీప్ నెక్‌లైన్ కలిగిన స్లీవ్ లెస్ బ్లూ కలర్ బ్లౌజ్‌ను వేసుకుని తన గ్లామరస్ లుక్స్‌తో యూత్‌ను ఫిదా చేసేసింది.

జాన్వీ తన కురులతో మధ్యపాపిట తీసి లూజ్‌గా వదులుకుంది. చెవులకు భారీ సిల్వర్ జుంకాలను ధరించింది. చేతి వేళ్లకు స్టేట్‌మెంట్ ఉంగడారులను పెట్టుకుంది. సింపుల్ వేకప్‌తో పెదాలకు పింక్ గ్లాసీ లిప్ షేడ్ దిద్దుకుని కనులకు మస్కరా, ఐ లైనర్, ఐ ష్యాడో వేసుకుని , మినిమల్ జ్యువెల్లరీ అలంకరణతో సోషల్ మీడియాను షేక్ చేసేసింది.

ఓ వైపు సినిమా ప్రమోషన్ పనిలో బిజీగా ఉంటూనే మరోవైపు బర్త్‌డే పార్టీలని , ఫెస్టివ్ పార్టీలని సిటీ అంతా షికారు చేసేస్తోంది ఈ భామ. ఇక ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ కాస్త టైమ్ ఇన్‌స్టా ఫ్యామిలీకి కేటాయిస్తోంది. హాట్ ఫోటో షూట్ పిక్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది ఈ చిన్నది.