Janhvi Kapoor : జాన్వీ కపూర్ మాల్దీవులలో తాను కలలు కనే వెకేషన్ నుండి బయటకు వచ్చినా ఇంకా ఈ బ్యూటీ ఇప్పటికీ అదే మూడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలి జాన్వీ రెడ్ కార్పెట్ లుక్ అది రుజువు చేస్తుంది. ముంబైలో జరిగిన నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్‌లో రెడ్ కార్పెట్‌పై మెరిసేందుకు జాన్వీ కపూర్ అద్భుతమైన పసుపు గౌను ధరించి అందరి లుక్స్ ను తనవైపుకు తిప్పుకుంది. ప్రకాశవంతమైన మత్స్యకన్య గౌన్ ను అలంకరించుకుని ఫ్యాన్స్ ను మెస్మెరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ అవుట్ ఫిట్ తో దిగిన పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్‌కి మ్యూస్‌గా వ్యవహరించింది. ఈ అవార్డుల వేడుకకు మత్స్యకన్యగా అలంకరించడానికి అద్భుతమైన పసుపు రంగు గౌనును ఎంచుకుంది. ఈ అవుట్ ఫిట్ లో జాన్వీ ఎంతో హాట్ గా కనిపించింది. నాభి అందాలను చూపిస్తూ కుర్రాళ్ళను రెచ్చగొట్టింది.

హాల్టర్ నెక్‌లైన్ , ర్యాప్-ఓవర్ వివరాలతో కూడిన గౌనులో జాన్వీ అద్భుతంగా కనిపించింది. గౌను బ్యాక్‌లెస్ వివరాలు , కట్-అవుట్ నమూనాలతో మిడ్‌రిఫ్-బేరింగ్ వివరాలతో ఎంతో అద్భుతంగా డిజైన్ చేసారు డిజైనర్. జాన్వీ ఆకారాన్ని కౌగిలించుకుని, ఆమె ఒంపులను చక్కగా చూపిస్తూ, మెర్మైడ్ లాంటి నమూనాలు కలిగిన స్కర్ట్ గౌను ఫ్యాషన్ ప్రియులను మరింతగా ఆకట్టుకుంది.

ఫ్యాషన్ స్టైలిస్ట్ తాన్యా ఘావ్రీ జాన్వీకి స్టైలిష్ లుక్స్ ని అందించింది. జాన్వీ తన కురులతో మధ్య పాపిట తీసి కొప్పు చుట్టుకుంది. జాన్వీ, మేకప్ ఆర్టిస్ట్ రివేరా లిన్ సహాయంతో తన అందానికి మరిన్ని మెరుగులు దిద్దింది. కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, కాను రెప్పలకు మస్కరా పేదలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని తన గ్లామరోస్ లుక్స్ తో అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది.

ఈ జలకన్య డ్రెస్ తో దిగిన పిక్స్ ను జాన్వీ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.