శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ జాన్వీ కపూర్. ఈ అమ్మడు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా డిఫరెంట్, కంటెంట్ బేస్ చిత్రాలతో నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. తండ్రి సహకారంతో ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఇక వెండితెరపై నటిగా ప్రేక్షకులు కోరుకునే బెస్ట్ ఇవ్వడానికి తాను వీలైనంత వరకు కష్టపడతానని ఈ బ్యూటీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక హిందీలో ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో ఓ మూడు సినిమాల వరకు ఉన్నాయి. వాటిపై మంచి బజ్ ఉంది. ఇక జాన్వీ కపూర్ ని తెలుగులో పరిచయం చేయాలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏవో కారణాల వలన తెలుగు డెబ్యూ జరగడం లేదు. అయితే కచ్చితంగా తన టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని జాన్వీ కపూర్ తన కొత్త సినిమా ప్రమోషన్ లో భాగంగా క్లారిటీ ఇచ్చింది.
ఇక ఎన్టీఆర్ తన ఫెవరెట్ హీరో అని అతనితో కలిసి నటించాలని ఆశపడుతున్నట్లు కూడా చెప్పింది. ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ బయట క్యాజువల్ గా కనిపించిన కూడా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది.క్లివేజ్ షోతో ఆణువణువూ కనిపించే విధంగా కాస్ట్యూమ్స్ వేస్తూ కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుంది. ఇక ఈ హాట్ ఫోటోల కారణంగా జాన్వీ కపూర్ కి ఇన్స్టాగ్రామ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపధ్యంలో ప్రముఖ కాస్ట్యూమ్స్ కంపెనీలు తన ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకోవడానికి జాన్వీ కపూర్ కి భారీగానే అఫర్ చేస్తున్నారని తెలుస్తుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియాని తన ఈఎంఐలు చెల్లించుకోవడానికి వాడుతున్నానని చెప్పింది. దీనిని బట్టి ఆమె సోషల్ మీడియాని సంపాదన కోసం ఉపయోగిస్తున్న అని చెప్పకనే చెప్పేసింది.
ఒక బ్రాండ్ ప్రమోషన్ చేయడం ద్వారా తనకు వచ్చే డబ్బులతో ఈఎంఐలు చెల్లిస్తానని చెప్పింది. ఇలా జాన్వీ కపూర్ ఇన్స్టాగ్రామ్ లో తన హాట్ ఫోటోలని కాస్ట్యూమ్స్ బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగానే పెడుతుందని తెలుస్తుంది. ఇక ఈ ప్రమోషన్ ద్వారా ఒక్కో పోస్ట్ కి జాన్వీ కపూర్ 70 నుంచి 80 లక్షల వరకు ఆర్జిస్తుందని సమాచారం. ఇక బాలీవుడ్ లో దిశా పటాని సోషల్ మీడియాలో బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్న భామలతో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు చాలా మంది బాలీవుడ్ భామలు ఇన్స్టాగ్రామ్ ని కాస్ట్యూమ్స్ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకొని లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ జాబితాలో జాన్వీ కూడా చేరిందని ఆమె మాటల బట్టి తెలుస్తుంది.