శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టి వడివడిగా అడుగులు వేస్తున్న అందాల భామ జాన్వీ కపూర్. ఈ అమ్మడు ఓ వైపు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే తన తండ్రి నిర్మాణంలో డిఫరెంట్ కథలతో నటిగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. తనని తాను బెస్ట్ యాక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి జాన్వీ కపూర్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇక వెనుక తండ్రి అండదండలు ఉండటంతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా బాగానే నిలదొక్కుకుంది. అయితే ఈమెని తెలుగు తెరకి పరిచయం చేయాలని చాలా మంది నిర్మాతలు, దర్శకులు భావిస్తున్న అది వర్క్ అవుట్ కావడం లేదు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్రతి సినిమాని, ఆమె నటనని అతిలోక సుందరి శ్రీదేవితో పోల్చి చూడటం అందరికి అలవాటైపోయింది.
శ్రీదేవి కూతురు అంటే ఆమె నటనలో సగం చేసిన కూడా ప్రశంసలు లభిస్తాయి. అయితే శ్రీదేవితో ప్రతి సినిమాకి పోల్చి చూడటం వలన జాన్వీ కపూర్ మీద కూడా బాగా ఒత్తిడి ఎక్కువైపోతోంది. అమ్మ నటనలో సగం కూడా చేయలేకపోతున్న అనే ఫీలింగ్ తనని వెంటాడుతుంది. అయితే ఇకపై దాని నుంచి బయటపడాలని జాన్వీ కపూర్ భావిస్తుంది. ఈ నేపధ్యంలో తన తల్లి శ్రీదేవితో తనని పోల్చి చూడొద్దు అంటూ మీడియాకి వేడుకుంటుంది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోయిన్ గా కూడా సుదీర్ఘకాలం కొనసాగింది.
శ్రీదేవి కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలని చేసింది. అయితే నటిగా ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. అమ్మ అంత అనుభవం కాని, అర్ధం చేసుకునే వయస్సు కానీ నాకు లేవు. నటనలో ఇంకా ఓనమాలు నేర్చుకుంటున్న ఈ ఇలాంటి సమయంలో అమ్మతో పోల్చి చూడటం వలన తనపై మరింత ఒత్తిడి పెరుగుతుందని జాన్వీ కపూర్ చెప్పినట్లు టాక్. నటనలో ఎవరి ప్రత్యేకతలు వారికి ఉంటాయని, నటిగా నాకంటూ ఒక ఐడెంటిటీ కోరుకుంటున్నా అని దయచేసి తన తల్లితో తనని పోల్చి చూడొద్దు అంటూ వేడుకుంటుంది. ఇక బోనీ కపూర్ కూడా జాన్వీ కపూర్ ని శ్రీదేవితో పోల్చి చూసే ప్రయత్నం చేయొద్దు అని చెబుతున్నారు. జాన్వీ కపూర్ ఇంకా ఆరంభంలోనే ఉందని శ్రీదేవి ఇమేజ్ ని కానీ, ఆమె నటన స్థాయిని అందుకోవడానికి సమయం పడుతుందని, ఆ అవకాశం తనకి ఇవ్వాలని బోనీ కపూర్ అభ్యర్ధించారు.