Janhvi Kapoor : మిలీ మూవీతో మంచి మార్కులు కొట్టేయడంతో మంచి ఊపు మీద ఉంది బాలీవుడ్ యువ కథానాయిక జాన్వీ కపూర్. తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలను సైతం అందుకుంది ఈ చిన్నది. మూవీ విడుదలకు నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్లతో హడావిడి చేసింది జాన్వీ కపూర్. ఫ్యాషన్ అవుట్‌ఫిట్స్‌ను ధరించి అందరిని అలరించింది. తాజాగా మరో అవుట్ ఫిట్‌తో కుర్రాళ్ల హృదయాలను మరోసారి దోచేసింది ఈ బ్యూటీ. దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్ కోసం జాన్వీ కపూర్ సిల్వర్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్‌పైన తన అందాల విందును పరిచింది. ఈ అవుట్‌ఫిట్‌తో చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్‌ను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అవుట్‌ఫిట్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అమ్మడి అందాల ప్రదర్శన గురించే హాట్ టాపిక్ నడుస్తోంది.

Janhvi Kapoor : రీసెంట్‌గా ఓ అవార్డుల ఫంక్షన్ కోసం జాన్వీ కపూర్ దుబాయ్ వెళ్లింది. ఈ ఈవెంట్ లో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు విభిన్న అవుట్‌ఫిట్స్‌ను ధరించి అందరిని ఆకట్టుకున్నారు. బాలీవుడ్ ఫ్యాషన్ దివా జాన్వీ కపూర్ కూడా తనదైన స్టైలిష్ లుక్స్‌ను రెడ్ కార్పెట్‌పైన ప్రదర్శించింది. స్టన్నింగ్ సిల్వర్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్ మీద రచ్చరచ్చ చేసింది. జాన్వీ బోల్డ్ లుక్స్‌తో హాట్ ఫోటో షూట్ చేసి అందరిని మెస్మరైజ్ చేసింది.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఫరాజ్ మనన్ కు మ్యూజ్‌గా వ్యవహరించింది జాన్వీ కపూర్ . ఈ అదిరిపోయే గౌన్‌ను ఈ డిజైనర్ షెల్ఫ్ నుంచే సేకరించింది జాన్వీ. ఆఫ్ షోల్డ్ సీక్విన్ డీటైల్స్‌తో ప్లంగింగ్ నెక్‌లైన్‌తో వచ్చిన టాప్ వేసుకుని దానికి చుట్టూతా ఐవరీ వైట్ సాటిన్ క్లాత్‌ను చుట్టుకుని ట్రెండీ లుక్‌లో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది జాన్వీ కపూర్.

ఈ గౌనుకు వచ్చిన థై హై స్లిట్ జాన్వీ తొడ అందాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. మినిమల్ మేకప్‌తో తన చెవులకు వైట్ కలర్ ఇయర్ రింగ్స్‌ను పెట్టుకుని తన రూపాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకుంది. పాదాలకు వైట్ కలర్ హీల్స్ వేసుకుని వయ్యారంగా నడిచి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది.

జాన్వీకపూర్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫ్యాషన్ ఫోటో షూట్‌లను చేస్తూ ఎప్పుడూ బిజీ బిజీగ ఉంటుంది. తన డెయిలీ జిమ్ వర్కౌట్ కోసం కూడా ఈ భామ లేటెస్ట్ అవుట్‌ఫిట్స్‌ను ధరించి ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంటుంది. బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల ఫ్యాషన్ స్టైల్స్ ఏ విధంగా అందరిని ఆకట్టుకుంటాయో జాన్వీ కూడా అంతటి రేంజ్ ఫ్యాషన్స్‌ను ఫాలో అవుతూ ఫాలోవర్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది.

తన లుక్స్‌కు మరింత క్రేజ్‌ను జోడించేందుకు ఈ బ్యూటీ సోషల్ మీడియాను వారధిగా చేసుకుంది. జాన్వీ చేసే ప్రతి ఫోటో షూట్ పిక్స్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. ఫాలోవర్స్‌ను మెస్మరూజ్ చేస్తుంటుంది. తాజాగా పోస్ట్ చేసిన హాట్ పిక్స్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందమైన లుక్స్‌కు పొగడ్తల వర్షం కురుస్తోంది.
