అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ కూతురుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఓ విధంగా చెప్పాలంటే స్టార్ హీరోయిన్ గా తల్లి, స్టార్ ప్రొడ్యూసర్ గా తండ్రి ఉండగా ఆమె కూడా స్టార్ కిడ్ గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె మొదటి సినిమా సెలబ్రెటీ వారసులని పరిచయం చేసే కరణ్ జోహార్ చేతుల మీదుగా జరిగింది. ఆ సినిమా తర్వాత జాన్వీ కపూర్ కి అవకాశాలు కూడా బాగానే క్యూ కట్టాయి. ప్రస్తుతం తండ్రి బోనీ కపూర్ జాన్వీతో రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. ఇంతటి స్ట్రాంగ్ బ్యాగ్రౌండ్ ఉండటం వలనే ఈ బ్యూటీ చాలా వేగంగా హీరోయిన్ అయిపోయిందని, ఇండస్టీ కష్టాలు చూడకుండానే హ్యాపీగా అవకాశాలు సొంతం చేసుకుందనే విమర్శ బిటౌన్ లో ఉంది.
ఇక జాన్వీ కపూర్ ని తెలుగులో పరిచయం చేయాలని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ బ్యూటీ మాత్రం తాను టాలెంట్ లేకుండా స్టార్ కిడ్ గానే అవకాశాలు సొంతం చేసుకుందని ఎవరైనా విమర్శలు చేస్తే ఒప్పుకోవడం లేదు. స్టార్ ఫ్యామిలీ నుంచి రావడం అనేది మాకున్న గుర్తింపే అయినా కూడా అది కేవలం పరిచయాల కోసం మాత్రమే ఉపయోగపడుతుందని జాన్వీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అవకాశాలు రావడం, రాకపోవడం అనేది పూర్తిగా మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుందని అంటుంది. ఇండస్ట్రీలో అందరిలాగే నటిగా ఎదగడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నా అని చెబుతుంది.
శ్రీదేవి కూతురు అనే బ్రాండ్ తనపై ఉండటంతో తనని కూడా నటిగా అదే స్థాయిలో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారని, ఆ స్థాయిని అందుకోవడానికి షూటింగ్స్ లో ఎంత కష్టపడుతున్నా అనేది నాకు మాత్రమే తెలుసని చెప్పింది. అయితే పదే పదే తాను కష్టపడుతున్న అని చెప్పుకోవడం కూడా బోరింగ్ గా ఉంటుందని జాన్వీ కపూర్ కామెంట్స్ చేసింది. అందుకే నన్ను నేను నటిగా ప్రూవ్ చేసుకోవడానికి వీలైనంత ఎక్కువ ఫోకస్ పెడతానని చెప్పింది. స్టార్ కిడ్ గా ఉండటం లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని, ప్రేక్షకుల అంచనాలు తమపై భారీగా ఉంటాయని, వాటిని అందుకోలేకపోతే విమర్శలు వస్తాయని చెప్పింది.