Janhvi Kapoor: అతిలోక సుందరి.. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో హిట్ కొట్టాలని చాలా కష్టపడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడాలి. స్టార్ డమ్ తో పాటు కఠిన శ్రమ అవసరం. శ్రీదేవి కూతురిగా ఆదరించాలంటే కాస్త కష్టమే. సొంత ట్యాలెంట్ ను నమ్ముకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటానంటూ జాన్వీ కపూర్ చాలా సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు.
ముఖ్యంగా హీరోయిన్ అంటే చాలా పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నటన పరంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొన్ని పాత్రలు అవలీలగా ఉంటాయి. కానీ కొన్ని కష్టతరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ ఓ ఛాలెంజింగ్ రోల్ చేసింది. మిలీ సినిమాలో మైనస్ 16 డిగ్రీల్లో ఇరుక్కుపోయినట్లుగా నటించాల్సి వచ్చింది. ఇందుకోసం తాను ఏడున్నర కిలోల బరువు తగ్గిందట.
మళయాలంలో సూపర్ హిట్ కొట్టిన హెలెన్ సినిమాకు ఈ మూవీ రీమేక్ గా వస్తోంది. ముత్తుకుట్టి జేవీఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 4న ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ ఓ జాతీయ మీడియా చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడింది. షూటింగ్ సందర్భంగా తాను పడిన కష్టాలను వివరించింది. శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెప్పింది.
Janhvi Kapoor: ఫ్రిజ్ లో ఉన్నట్లు కల వచ్చేది..
మైనస్ డిగ్రీల చలిలో ఫ్రిజ్ లో ఉన్నట్లు నటించిన సీన్లు అయితే ఏకంగా నిద్రపోతుండగా కలలో కూడా వచ్చేవని తెలిపింది. నిద్ర పట్టేది కాదని వాపోయింది. ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెప్పింది. దాదాపు మూడు రోజులు పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వచ్చిందని తెలిపింది. డైరెక్టర్ ఆరోగ్యం కూడా దెబ్బ తినిందని, ఇలా కష్టపడ్డాం అని చెప్పుకొచ్చింది. ఫలితం తప్పకుండా వస్తుందన్న నమ్మకం ఉందని చెప్పింది.