Janhvi Kapoor : ఓ వైపు ఫెస్టివల్ పార్టీస్ మరోవైపు మూవీ ప్రమోషన్స్‌తో గత కొంత కాలంగా బిజీ బిజీగా ఉంటోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. ఈ బ్యూటీ నటించిన మిలీ చిత్రం త్వరలో విడుదల కాబోతున్న సందర్భంగా తన ఫ్యాషన్ స్టైల్స్ తో ప్రమోషన్స్ చేస్తూ ఫాలోవర్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా జరిగిన మిలీ ప్రమోషన్ ఈవెంట్ కోసం జాన్వీ రెడ్ కలర్ ఫిగర్ హగ్గింగ్ డ్రెస్ వేసుకుని తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. ఈ అవుట్‌ఫిట్‌తో చేసిన గ్లామరస్ ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Janhvi Kapoor : దీపావళి పండుగ సందడి ముగియడంతో జాన్వీ త్వరలో రిలీజ్ కాబోతున్న తన మూవీపై దృష్టి సారించింది. ప్రమెషన్‌లో భాగంగా ముంబైలో సందడి చేసన జాన్వీ టైట్ ఫిట్ రెడ్ అవుట్ ఫిట్‌ను వేసుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఈ అవుట్‌ఫిట్‌తో చేసిన గ్లామరస్ ఫోటోలను జాన్వీ తన ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేసింది. హాట్ యాంగిల్‌లో ఉన్న ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

ఈ గ్లామరస్ అవుట్‌ఫిట్‌తో పార్టీ ఫ్యాషన్‌ను ప్రమోట్ చేస్తోంది జాన్వీ కపూర్. వరుసపెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిక్స్‌ను పోస్ట్ చేసి ఇన్ థియేటర్స్ నవంబర్ 4 అని క్యాప్షన్‌ను జోడించింది.

స్ట్రాపీ హాల్టర్ నెక్‌లైన్ , ఫిగర్ హగ్గింగ్ డీటైల్స్‌తో ఫ్లోర్ స్వీపింగ్ హెమ్ లెన్త్ తో వచ్చిన స్లీవ్ లెస్ రెడ్ బాడీకాన్ డ్రెస్‌లో హాట్ చిక్‌లా కవ్వించింది జాన్వీ. అంతే కాదు అవుట్ ఫిట్‌కు వచ్చిన బ్యాక్‌లెస్ డీటైల్స్, బ్యాక్ స్లిట్ జాన్వీకి సెక్సీ అప్పీల్‌ను అందించాయి. తన అందాలు ఎక్కడెక్కడ ఉన్నాయో స్పష్టంగా ఈ అవుట్‌ఫిట్ ద్వారా చూపిస్తోంది జాన్వీ. అంతే కాదు పాతకాలం నాటి హాలీవుడ్ గ్లామర్‌ను తన లుక్ ద్వారా మరోసారి గుర్తు చేస్తోంది.

ఈ అవుట్‌ఫిట్ హైలెట్ అయ్యే విధంగా మినిమల్ ఆక్సెసరీస్‌ను ఎన్నుకుంది జాన్వీ. పాదాలకు మ్యాచింగ్ గా హైహీల్స్ , చెవులకు ముత్యాల ఇయర్ రింగ్స్ చేతి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుని స్టైలిష్ లుక్స్‌తో స్టన్నింగ్‌గా కనిపించింది.

తన లుక్స్ విషయానికి వస్తే కురులను సైడ్ పాపిట తీసి లూజ్ గా వదులుకుంది . పెదాలకు బోల్డ్ రెడ్ లిప్ షేడ్ దిద్దుకుంది. కనులకు వింగెడ్ ఐలైనర్, షిమ్మరీ ఐ ష్యాడో, మస్కరాను వేసుకుని మెస్మరైజింగ్ లుక్స్‌తో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.

తండ్రి బోనీకపూర్, కూతురు జాన్వీ కపూర్ కలిసి మొదటిసారి చేస్తున్న ప్రాజెక్ట్ మిలీ. ఈ సినిమాను బోనీకపూర్ నిర్మిస్తుండగా హీరోయిన్‌గా జాన్వీ నటించింది. మిలీ చిత్రం నవంబర్ 4 న థియేటర్స్‌లో విడుదల కానుంది. జాన్వీతో పాటు ఈ సినిమాలో మనోజ్ పహ్వా, సన్నీ కౌషల్ లీడింగ్ రోల్స్‌లో నటిస్తున్నారు.