Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌ల నుండి స్నిప్పెట్స్ ను ఇన్‌స్టాగ్రామ్ కుటుంబంతో పంచుకుంది. సంపూర్ణ ఫ్యాషన్‌వాది అయిన ఈ బ్యూటీ , ఆమె సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ తో అందరిని ఎప్పుడూ ఫిదా చేస్తుంది. సాధారణ అవుట్ ఫిట్స్ నుంచి ఎత్నిక్ డ్రెస్ ల వరకు అన్నింటిని సందర్భానుసారం ధరిస్తూ పర్ఫెక్ట్‌గా ఎలా కనిపించాలో జాన్వీకి బాగా తెలుసు. అందుకే ఈ బ్యూటీ అంటే ముంబై ఫొటోగ్రాఫర్లకు చాలా ఇష్టం. ఆమె వ్యక్తిగత పనులు లేదా వృత్తిపరమైన విధుల కోసం బయలుదేరే ప్రతిసారి కెమెరా క్లిక్ మనిపిస్తారు.

తాజాగా ఈ బ్యూటీ రాబోయే క్రిస్మస్ వేడుకల కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటినుంచే జాన్వీ క్రిస్మస్ వేడుకల కోసం సన్నాహాలు ప్రారంభించింది. లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో జాన్వీ తన స్టైలిష్ అవుట్ ఫిట్ తో క్రిస్మస్ సీజన్ ఫ్యాషన్ ను ప్రోమోట్ చేస్తోంది. ఈ పిక్స్ లో బ్లాక్ డ్రెస్ లో క్లివేజ్ షో చేస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేసింది జాన్వీ.

ప్లంగింగ్ నెక్‌లైన్‌ని డ్రామాటిక్ ఫుల్ స్లీవ్‌లతో వచ్చిన ఈ డ్రెస్ లో ఏంటో హాట్ గా కనిపించింది ఈ బ్యూటీ. నెక్‌లైన్ దగ్గర వచ్చిన తెలుపు , బంగారు అలంకార వివరాలు అవుట్ ఫిట్ కు మరింత గ్లామర్ ను అందించింది. జాన్వీ తన డ్రెస్ ను ఫిష్‌నెట్ స్టాకింగ్స్ తో జత చేసి ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించింది. ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఈ పిక్స్ కు “సీజన్ శుభాకాంక్షలు” అని క్యాప్షన్ జోడించింది జాన్వీ.

ఈ బ్లాక్ అవుట్ ఫిట్ కు కాంట్రాస్ట్ గా చెవులకు వైట్ ఇయర్ స్టడ్స్, చేతి వేలికి డైమండ్ రింగ్ పెట్టుకుని అదరగొట్టింది. ఫ్యాషన్ స్టైలిస్ట్ మీగన్ కాన్సెసియో జాన్వీ కి స్టైలిష్ లుక్స్ అందించింది. మేకప్ ఆర్టిస్ట్ రివేరా లిన్ సహాయంతో, జాన్వీ కనులకు న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ వింగేడ్ ఐలైనర్, బ్లాక్ మస్కరాను దిద్దుకుంది. పేదలకు న్యూడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్ తో కుర్రాళ్ల గుండెల్లో హీట్ పెంచింది.
