Janhnavi Kapoor : బాలీవుడ్ యంగ్ హీరోయిన్ లు సినిమా రంగాన్నే కాదు ఫ్యాషన్ రంగస్థలంలోను తమ టాలెంట్ ఏంటో చూపిస్తున్నారు. రోజుకో ట్రెండి ఫ్యాషన్ ను ఫాలో అవుతూ చెలరేగిపోతున్నారు. ఇక అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు బోణి కపూర్ ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పెను లేదు. ఈ చిన్నదానికి సోషల్ మీడియా లో అట్లాంటి ఇట్లాంటి క్రేజ్ లేదు. అమ్మడు ఏ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన లైకులు, షేర్ లు, కామెంట్ ల వర్షం కురుస్తుంది. బయట కనిపిస్తే రచ్చ రచ్చే . మెరిసేటి గౌన్ లో అయినా , జిగేలుమనే చీర కట్టులో అయినా ఈ బ్యూటీ కట్టుకున్నాకే ట్రెండీ గా మారుతుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్క్రీన్ ముందే కాదు అఫ్ స్క్రీన్ లోను ట్రెండీ లుక్స్ లో కనిపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే జాన్వీ మొన్నే సాంప్రదాయబద్దంగా లంగా ఓని కట్టుకుని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తళుక్కుమంది. పరికిని ఓనిలో చూడచక్కగా ఉందంటూ జాన్వీ ఫాన్స్ పొగడ్తలతో ముంచేశారు . ఇదిలా ఉంటె ఈ రోజేమో వైట్ క్రాప్ టాప్ డెనిమ్ షార్ట్స్ వేసుకుని సెక్సీ లుక్ లో చెలరేగి పోయింది . దైవ దర్శనానికి ఒకలా, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మరోలా , ఇక ఫ్రెండ్స్ తో పార్టీస్ లో ఇంకోలా ఇలా ఒకేషన్ ని బట్టి …ప్లేస్ ని బట్టి ఎలాంటి దుస్తులు వేసుకోవాలో సెలబ్రిటీ గర్ల్స్ కి బాగా తెలుసు . ఇదే విషయాన్నీ జాన్వీ కపూర్ మరోసారి రుజువు చేసింది. ఈ డెనిమ్ షార్ట్స్ అవుట్ ఫిట్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ జాన్వీ ఇన్ స్టా లో తెగ వైరల్ అవుతున్నాయి . ఈ బ్యూటీ ని క్యూట్ నెస్ లో ఓడించలేమని ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచేస్తున్నారు.
Janhnavi Kapoor : సాగర తీరం లో సూర్యాస్తమ సమయంలో వయ్యారాలను ఒలకబోసింది..
డెనిమ్ షార్ట్స్ తో కనిపించడం జాన్వికి కొత్తేమి కాదు. ఆమెను ఇన్ స్టా లో ఫాలో అయ్యేవారికి ఆమె ఫ్యాషన్ టేస్ట్ ఏంటో బాగా తెలుస్తుంది. గతం లోను సాగర తీరం లో సూర్యాస్తమ సమయంలో తన వయ్యారాలను ఒలకబోస్తూ జాన్వీ దిగిన ఫోటోలను నెట్టింట్లో పోస్ట్ చేయగా అవి సెన్సేషన్ ని క్రీయేట్ చేసాయి . హాలీడే లో ఉన్నప్పుడే కాదు ఆలా వర్క్ అవుట్ కి వెళ్లాలన్నా, ఫ్రెండ్స్ తో చిల్ అవ్వాలన్నా జాన్వీ వైట్ క్రాప్ తో డెనిమ్ జీన్స్ కే ప్రయారిటీ ఇస్తుంది.
Janhnavi Kapoor : జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కి ప్లాన్ చేస్తున్న కొరటాల..
ఇటీవలే జాన్వీ కపూర్ నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా హాట్ స్టార్ లో విడుదలయ్యింది. ఈ సినిమా లో డ్రగ్ మాఫియాలో చిక్కుకున్న అమాయకపు అమ్మాయి పాత్రలో జాన్వీ మెప్పించింది. అయినా సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఇక తన బెస్టి సారా అలీఖాన్ తో కలిసి కాఫీ విత్ కారన్ జోహార్ షో లో పాల్గొని సందడి చేసింది. త్వరలో ఈ చిన్నది నటించిన మిలి చిత్రం విడుదల కానుంది. ఇది కాక మిస్టర్ అండ్ మిస్సెస్ మహి లో, వరుణ్ ధావన్ తో జవాల్ లో నటిస్తోంది. త్వరలో టాలీవుడ్ లోకి అడుగులు వేయాలని చూస్తోంది ఈ భామ. ఎన్టీఆర్ తో జోడి కట్టేందుకు సిద్ధమవుతోందని ఇండస్ట్రీ టాక్. దానికోసం కొరటాల తెగ ట్రై చేస్తున్నారట. చూడాలి మరి అమ్మడి స్టార్ ఏ రేంజ్ లో ఉందో మరి .