దర్శక దిగ్గజం రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత నెక్స్ట్ మూవీగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వాంచర్ థ్రిల్లర్ గా ఈ మూవీని జక్కన్న ఆవిష్కరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కథని విజయేంద్రప్రసాద్ పూర్తి చేసి రాజమౌళి చేతిలో పెట్టినట్లు తెలుస్తుంది. ఇక భారీ తారాగణంతో పాన్ ఇండియా లెవల్ లో హాలీవుడ్ స్టాండర్డ్ లో మరోసారి జక్కన్న ఈ మూవీని ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని రాజమౌళి చెప్పారు. ప్రపంచ సాహసికుడి కథగా దీనిని చూపించబోతున్నట్లు చెప్పారు.
ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమాపై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జక్కన్న ట్రాక్ రికార్డు నేపధ్యంలో ఈ కథని అస్సలు వినకుండానే మహేష్ బాబు ఒకే చెప్పేసినట్లు తెలుస్తుంది. ఇక రాజమౌళితో ఒక సినిమా చేస్తే 25 సినిమాలు చేసిన క్రేజ్ వస్తుందని, దాని కోసం వెయిట్ చేస్తున్నట్లు మహేష్ కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ని కన్ఫర్మ్ చేసినట్లు టాక్ నడుస్తుంది. స్టార్ హీరోల సినిమాలకి ఫస్ట్ రివ్యూ చెప్పే ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సందూ ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ధ్రువీకరించాడు.
అలియా భట్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం సైన్ చేసిందని కన్ఫర్మ్ చేశాడు. అయితే ఇది ఎంత వరకు వాస్తవం అనేది చెప్పలేము. దీనికి కారణం రాజమౌళి మహేష్ సినిమాని జనవరి 26కి ప్రారంభించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అలియా భట్ గర్భంతో ఉంది. మహేష్ సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి అలియా భట్ బిడ్డతో బాలింతగా ఉంటుంది. లుక్స్ పరంగా, ఫిట్ నెస్ పరంగా అంత పర్ఫెక్ట్ గా ఉండదు. మరి అలాంటి ఆమెని తీసుకొచ్చి మహేష్ బాబు లాంటి హ్యాండ్ సమ్ హీరో పక్కన పెడితే చూడటానికి ఎవరూ ఆసక్తి చూపించరు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. మరి ఈ నేపధ్యంలో అలియా భట్ ఎంపిక ఎంత వరకు కరెక్ట్ అనేది తెలియాల్సి ఉంది.