Jake Flint: మరణం ఎవరిని, ఎప్పుడు, ఎలా కబలిస్తుందో ఎవరికీ తెలియదు. చిన్నా, పెద్దా, ముసలి, ముతకా అనే బేధాలు లేకుండా మృత్యువు అందరికీ కబలిస్తుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో తక్కువ వయసులోని వాళ్లు అకాల మృత్యువు బారినపడుతున్నారు. ఒక్కసారిగా అందరినీ వదిలి పరలోకాలకు ప్రయాణమవుతున్నారు.
పెళ్లి చేసుకున్న కొద్దిగంటలకే ఓ సింగర్ మరణించడం అందరినీ కలచి వేసింది. అమెరికాకు చెందిన సింగర్ జేక్ ఫ్లింట్ ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని, తన భార్యా, పిల్లలతో ఎంతో సంతోషకర జీవితాన్ని అనుభవిద్దామని ప్లాన్ చేశాడు. కానీ ఆ దేవుడు మాత్రం వేరే ప్లాన్ చేసి, అతడి ప్రాణాలను హరించాడు.
అమెరికాలోని ఓక్లామాలో 1985లో సింగర్ జేక్ ఫ్లింట్ జన్మించాడు. సింగర్ గా ఒక్కో మెట్టు ఎక్కుకుంటే.. దేశంలోనే మంచి సింగర్ల జాబితాలో నిలిచాడు. ఈ శనివారం బ్రెండ్ విల్సన్ ను ఎంతో ఘనంగా సింగర్ జేక్ ఫ్లింట్ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే అతడు మరణించినట్లు అతడి స్నేహితుడు, అతడి ప్రచార వ్యవహారాలను చూసుకునే క్లిఫ్ డోయల్ వెల్లడించాడు.
Jake Flint:
దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. సింగర్ గా జేక్ ఫ్లింట్ జీవితంలో ఇంకా ఎంతో సాధించాల్సి ఉందని, అంతలోనే మృత్యువు కబలించిందని అందరూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. మొదటి ఆల్బమ్ అయామ్ నాట్ ఓకే 2016లో విడుదల కాగా.. వాట్స్ యువర్ నేమ్, లాంగ్ రోడ్ బ్యాక్ హోం, కౌ టౌన్, ఫైర్ లైన్ వంటి హిట్ ఆల్బమ్స్ తో జేక్ కు మంచి గుర్తింపు లభించింది.