నేను విన్నాను నేను ఉన్నాను అని ఎన్నికల ముందు ప్రచారం చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు.నిత్యావసరాలు,పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న పట్టి పట్టనట్టు ఉంటున్నారు. ఉద్యోగులకు పిఆర్సిలు,డిఎ లు ఇవ్వట్లేదు.అసలే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్ర నిధులన్నీ పథకాల పేరుతో ప్రజలకు ఉచితలు ఇస్తూ సోమరిపోతులని చేస్తున్నారు.దీంతో ఇల్లు కట్టాలని కలలు కనే మిడిల్ క్లాస్ వారికి మెటీరియల్ కంటే లేబర్ భారం అవుతున్నారు.
జగన్ ప్రవేశ పెట్టిన పథకాల రాష్ట్రానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయి.ఆయన ఇవేవి పట్టని జగన్ సర్కార్ తమ అనుకున్నది మొండిగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది.దీంతో ప్రజలలో అసహనం పెరిగిపోతోంది.ఇలాంటి సమయంలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.ఇంతకీ విషయం ఏంటంటే?వర్షాలు వల్ల దెబ్బ తిన్న రోడ్డు గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అక్కడ ఆగ్రహావేశాలు చెందిన కొందరు స్థానికులు జగన్న ఉన్నాడు జాగ్రత్త అని స్టాండిని పెట్టారు.ప్రస్తుతం అది నేట్టింటా వైరల్ అవుతుంది.