విశాఖపట్నంలో టూరిజం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ రంగం సిద్ధం చేసుకుంటుంది అందులో భాగంగా టూరిస్ట్ లను ఆకర్షించేందుకు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 250 కోట్లతో ఓ భారీ ప్రాజెక్ట్ ను డిజైన్ చేస్తుంది.ఈ ప్రాజెక్ట్ లండన్ లోని ఐ మెగా వీల్ ను పోలి ఉంటుందని 125 మీటర్లు ఎత్తుతో ఈ మెగా వీల్ ను నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం
ప్రపంచంలో ఉన్న టాప్ 10 మెగా వీల్స్ లో ఇది కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.భూకంపాలు,తుఫాన్లు ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా ఈ మెగా వీల్ ను నిర్మించాలని ప్రభుత్వం అధికారులకు సూచిందట.