బాలీవుడ్ సెలబ్రెటీలు తరుచుగా ఏవో ఒక గొడవల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఆ మధ్య డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ లో ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే. ఇక హీరోయిన్స్ విషయంలో ఇది మరీ ఘోరంగా ఉంటుంది. కార్పొరేట్ ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ, అలాగే విదేశాలలో తిరుగుతూ వ్యాపార వేత్తల నుంచి వారు ఖరీదైన బహుమతులు పొందుతారు. ఇలా ఖరీదైన బహుమతులు పొందడం వెనుక కారణాలు ఉంటాయి. వ్యాపారవేత్తలతో వన్ డే డేట్ కి వెళ్లడం అనేది అక్కడ హీరోయిన్స్ కి బాగా అలవాటుగా మారిపోయింది.
సక్సెస్, ఫేమ్, మనీ ఈ మూడు బాలీవుడ్ లో హీరోయిన్స్ జీవితాలతో ముడిపడి ఉంటాయి. ఈ నేపధ్యంలోనే డేట్ కల్చర్ ని వారు చాలా చిన్న విషయంగా తీసుకుంటారు. అయితే ఇలాంటి కల్చర్ వలన ఒక్కోసారి చిక్కుల్లో పడతారు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా తెలుగు ఎంట్రీ ఇస్తున్న శ్రీలంక భామ జాక్వలైన్ ఫెర్నాండేజ్ అడ్డంగా మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుంది. దీనికి కారణం మనీ లాండరింగ్ వ్యవహారాలు నిర్వహించే వ్యక్తి ఉంచి ఆమె బహుమతులు స్వీకరించడమే. మనీలాండరింగ్ కేసులో సెప్టెంబర్ 26వ తేదీన హాజరుకావాలని జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ఆధారంగా జాక్వెలిన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది.
ఆర్థిక నేరస్థుడు సుకేశ్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన గిఫ్ట్‌లు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మనీలాడరింగ్ కేసులో జాక్వెలిన్‌ను ఈడీ ఇప్పటికే ఒకసారి విచారించింది. అలాగే జాక్వెలిన్‌కు చెందిన 7 కోట్ల ఆస్తుల్ని కూడా అటాచ్ చేసింది. మనీలాండరింగ్ కేసులో వ్యక్తులను మభ్యపెడుతున్నారనే ఆరోపణలపై సురేష్ పై 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అతనితో జాక్వెలిన్ ఉన్న చిత్రాలు వైరల్ కావడంతో ఈడీ ప్రశ్నించింది. ఈడీ అటాచ్ చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు తన కష్టార్జితమని జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పష్టం చేసింది. వాటికి ఆదాయపు పన్ను కూడా చెల్లిస్తున్నానని పేర్కొంది. అయినా కానీ ఈడీ ఆమె విషయంలో వెనక్కి తగ్గలేదు. వారి ఈ కేసులో ఆమె మీద అభియోగాలు ఎంత వరకు వెళ్తాయి అనేది చూడాలి.