బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ గత కొంత కాలంగా పోలీస్ కేసుల్లో నలిగిపోతుంది.. హవాలా కేటుగాడు సుఖేష్ చంద్రశేఖర్ 200 కోట్ల స్కామ్ దేశ వ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుఖేష్ నుంచి ఉచితంగా ఖరీదైన బహుమతులు తీసుకోవడంతో జాక్వలైన్ ని కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఈ రెగ్యులర్ లో విచారణకి హాజరవుతుంది. తన ప్రమేయం లేకుండానే ఈ కేసులో ఆమె అడ్డంగా ఇరుక్కుంది అనేది చాలా మంది మాట. కేవలం సుఖేష్ ఇచ్చి బహుమతులని తీసుకోవడమే నేరంగా మారింది. ఓ వైపు ఈ బ్యూటీ తెలుగులో పవన్ కళ్యాణ్ కి జోడీగా హరిహర వీరమల్లు సినిమా చేస్తుంది.
అలాగే హిందీలో కూడా కొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. సినిమాలు చేస్తున్న ఈ కేసు మాత్రం ఆమెని వెంటాడుతూనే ఉంది. అయితే సుఖేష్ చంద్రశేఖర్ తో ఆమె రిలేషన్ తో ఉన్నకారణంగానే అతను ఇచ్చిన ఖరీదైన బహుమతులని జాక్వలైన్ తీసుకుందని టాక్. ఇదే విషయాన్ని సుఖేష్ కూడా తాజాగా స్పందించాడు. జాక్వలైన్ ని తాను ఎంతగానో ప్రేమించానని చెప్పాడు. అనవసరంగా తనని ఈ కేసులో కావాలని ఇరికించారని చెప్పాడు. జాక్వలైన్ ని ఈ కేసులో నిందితురాలిగా చేర్చడం దారుణం అని వాపోయాడు. తామిద్దరం రిలేషన్ లో ఉండటం వలన ఆమె అడగకుండానే బహుమతులు నేనే ఇచ్చానని చెప్పాడు.
జాక్వలైన్ నా నుంచి ప్రేమని మాత్రమే కోరుకుందని, ఇంకేమీ ఆశించలేదని చెప్పాడు. అయితే నాకునేనుగా ఆమెకి ఖరీదైన బహుమతులు ఇచ్చానని, ఇందులో ఆమె ప్రమేయం ఏమీ లేదని సుఖేష్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయాలని సుఖేష్ ఒక లేఖ ద్వారా చెప్పడం విశేషం. అతను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని, ప్రేమలో ఉన్న తర్వాత ప్రియుడు బహుమతులు ఇవ్వడం అనేది సాధారణమైన విషయమే అని జాక్వలైన్ అభిమానులు అంటున్నారు. ఆ బహుమతులు ఎక్కడి నుంచి వచ్చాయి, అతని సంపాదన ఎలా వస్తుంది అనే విషయాలు జాక్వలైన్ కి ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. సెలబ్రెటీ అనే ఒకే ఒక కారణంతోనే ఆమెని మీడియా కూడా హైలైట్ చేస్తుందని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.