Jabardath Varsha: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లి తెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో తనదైన చెల్లెలు కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్న విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ కి ఎంట్రీ ఇవ్వకముందు వర్షా బుల్లితెరపై ప్రసారమయ్యే పళ్ళు సీరియల్స్ లో నటించినప్పటికీ రాని గుర్తింపు జబర్దస్త్ స్టేజ్ ద్వారా దక్కింది.
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో వర్ష కూడా ఒకరు. జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వర్ష విపరీతమైన పాపులారిటీ సంపాదించుకోవడంతోపాటు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఏర్పరుచుకుంది. జబర్దస్త్ ఆమె కెరియర్ కు ప్లస్ అవ్వడమే కాకుండా ఆర్థికంగా కెరియర్లో నిలదొక్కుకోవడానికి కూడా మార్గం వేసింది అని చెప్పవచ్చు.
ఇకపోతే వర్ష జబర్దస్త్ కి వచ్చిన తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకోవడానికి కారణం ఇమ్మానుయేల్. ఇమ్ము అంటూ లవ్ ట్రాక్ నడపడం వల్ల మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా వారిద్దరి లవ్ ట్రాక్ ఇద్దరికీ కెరియర్ పరంగా ప్లస్ అయ్యింది అని చెప్పవచ్చు. అయితే వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే జబర్దస్త్ కి కావాల్సిన ప్రోమోలు టిఆర్పి రేటింగ్స్ కూడా బాగా తెచ్చిపెడుతుంది ఈ జంట.
తెలుగు టెలివిజన్ పై సుడిగాలి సుదీర్, రష్మి ల జోడి తర్వాత అంతా పాపులర్ అయిన జంట వర్ష ఇమ్మానుయేల్. సుధీర్ రష్మీల మాధురి గానే వీరికి కూడా పెళ్లిళ్లు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే కేవలం జబర్దస్త్ స్టేజ్ లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా హాట్ డ్రెస్లతో కేక పుట్టిస్తూ ఉంటుంది వర్ష.
ఇక వర్ష కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే. రోజు రోజుకి తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటూ తనని ఫాలో అయ్యే వారి సంఖ్యను కూడా అంతకంతకు పెంచుకుంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా వర్ష సరికొత్త లుక్కులో వైట్ స్లీవ్ లెస్ టాప్ ఫాంట్ ధరించి యువతని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
కాగా వర్ష అందాల గ్లామర్ షోకీ యువత ఫిదా అవుతున్నారు. కాక తాజాగా వర్ష ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.