Jabardasth Varsha: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గురు, శుక్ర వారా లలో ప్రసారం అవుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. కాగా ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.
అలా జబర్దస్త్ చేసి ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష కూడా ఒకరు. జబర్దస్త్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది వర్ష. ఈమె జబర్దస్త్ కి రాకముందు వర్ష మొదట బుల్లితెర పై ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో నటించిన విషయం తేలిసిందే.
బుల్లితెర పై పని సీరియల్స్ లో నటించిన రాని గుర్తింపు జబర్దస్త్ ద్వారా వచ్చింది అని చెప్పవచ్చు. మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన వర్ష ఆ తరువాత బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చి అభిషేకం,తూర్పు పడమర,ప్రేమ ఎంత మధురం లాంటి సీరియళ్లలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత జబర్దస్త్ స్టేజ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈమె జబర్ధస్త్‌లో కమెడియన్ ఇమాన్యూయేల్ తో లవ్ ట్రాక్ వల్ల గా మరింత ఫేమస్ అయింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది.
ఇది ఇలా ఉంటే వర్ష తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈమె తాజాగా కొన్ని ఫోటో లను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో వర్ష వైట్ కలర్ టీ షర్ట్ ను ధరించగా, ఆ టీ షర్ట్ ఒక భుజంపై నుంచి జారిపోతూ లోదుస్తులు కనిపిస్తున్నాయి. ఇక తన మత్తెక్కించే చూపులతో యువత దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంటోందీ ఈ ముద్దుగుమ్మ.