జబర్దస్త్ కామెడీ రియాలిటీషోకి సౌమ్యరావు అనే కొత్త యాంకర్ ని మల్లెమాల వారు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కన్నడ అమ్మాయి అయినా సౌమ్య రావు తెలుగు టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఆమె ఇప్పుడిప్పుడే తెలుగు భాష మీద పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. రష్మి గౌతమ్ కి కూడా ఆరంభంలో తెలుగు అంతగా రాకున్నా ప్రేక్షకులపైకి ఆమెని యాంకర్ గా వదిలారు. తరువాత మెల్లగా ఆమె తెలుగు మీద పట్టు పెంచుకొని ఇప్పుడు స్టార్ యాంకర్ అయ్యింది. ఇలాగే సౌమ్య రావు కూడా మంచి యాంకర్ అయ్యే అవకాశాలు ఉండొచ్చని భావించి అంతంత మాత్రం తెలుగుతోనే ఆమెని మల్లెమాల వారు పరిచయం చేశారు.
అనసూయ, రష్మికి వచ్చినంత హైప్ అయితే సౌమ్యకి రావడం లేదు. కానీ ముందు ముందు గ్లామర్ షోతో షోకి కళ తీసుకొస్తుందని భావిస్తున్నారు. ఇక హైపర్ ఆది అయితే సౌమ్యతో మాటలు కలిపేసి ఆమెని లైన్ లో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆమెకి యాంకర్ గా బిడియం పోయేందుకు తన వంతుగా సహకారం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే యాంకర్ సౌమ్యరావుకి మల్లెమాల వారు భారీగానే ముట్టజెబుతున్నట్లు తెలుస్తుంది. ఆమెకి ఎపిసోడ్ కి 85 వేల వరకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారని సమాచారం.
ఓ విధంగా చెప్పాలంటే సీరియల్స్ ద్వారా వచ్చే ఆదాయం కంటే సౌమ్యకి ఈ జబర్దస్త్ షో ద్వారా భారీగానే ఆదాయం రాబోతుంది. మరి యాంకర్ అనసూయ, రష్మి తరహాలో కలర్ ఫుల్ డ్రెస్సులతో హాట్ షో కూడా చేస్తే ఎప్పటిలానే ఆమెకి కూడా ప్రత్యేకమైన ఫాలోయింగ్ పెరుగుతుంది. అలాగే భవిష్యత్తులో అనసూయ, రెష్మీ తరహాలో స్టార్ యాంకర్ గా మారిపోయే ఛాన్స్ ఉంది. మరి ఆ దిశగా ఈ అమ్మడు కుర్రాళ్ళని ఆకట్టుకునే విధంగా ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.