Itching: వేసవి సమయం వస్తుంది అంటే చాలు టీవీలో ప్రిక్లీ హీట్ ప్రకటనలతో హోరెత్తికిస్తాయి కంపెనీలన్నీ. వేసవిలో దురద సమస్య అందరినీ ఇబ్బంది పెడుతుంది కాబట్టి కంపెనీలు దాన్ని క్యాష్ చేసుకోవాలని చేస్తుంటాయి. మిగతా కాలంతో పోలిస్తే వేసవిలో ఈ సమస్య చాలా అధికం ఎందుకంటే వేసవి సమయంలో వేడి అధికంగా ఉంటుంది కాబట్టి. సూర్యుడు నిప్పులు చెరుగుతాడు కాబట్టి చెమట బాగా పడుతుంది.
వాతారణంలో వేడి పెరగడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. దీంతో దురద సమస్య ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి ఈ సమస్య తీవ్రతరం అయ్యి ఫంగల్ ఇన్ఫెక్షన్ గా మారే అవకాశం ఉంది. వేసవి కాలంలో జనాలు పౌడర్లు,మందులు వంటివి వాడటం మనం చూస్తుంటాం. అయితే ఈ దురద సమస్యకి ఎలాంటి మందులు వాడకుండా హోం రెమెడీలు కూడా వాడచ్చు అది కూడా మంచి ఫలితాలతో.
ఈ హోం రెమెడీలు వాడటం ద్వారా దురద,మంట వంటి ఇబ్బందుల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఎండాకాలంలో దాదాపు అందరి ఇళ్ళల్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి. వాటిని తీసుకుని ఇబ్బంది ఉన్న చోట రుద్దడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల దురద తగ్గడమే కాదు,వాపు ఉన్నా కూడా తగ్గుతుంది.
Itching:
కొబ్బరి నూనె: చర్మం డీహైడ్రేట్ అవ్వడం దురదకి ప్రధాన కారణం. కొబ్బరి నూనెతో దానికి చెక్ పెట్టొచ్చు.స్నానం తరువాత,దురద ఉన్న చోట కొబ్బరి నూనెని మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కాకపోతే నూనె రాసి వదిలేయడం మాత్రమే కాదు. అది ఆరేదాకా రుద్దాలి.రోజుకి రెండుసార్లు ఇలా నూనె రాస్తే దురదకి చెక్ పెట్టచ్చు.కొద్దిగా నీళ్ళలో నిమ్మరసం వేసి సమస్య ఉన్న చోట బాగా రుద్దడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు.అలోవెరా జెల్,కాలమైన్ లోషన్ కూడా దురదని తగ్గించడంలో ఉపయోగపడతాయి.