MP Santosh : ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తులపై ఆరోపణలు రావడం టీఆర్ఎస్ వర్గాలను కలవరపెడుతోంది. ఎమ్మెల్సీ కవితతో పాటు రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఈ కేసులో ఉచ్చు బిగిస్తుండటం కేసీఆర్ కుటుంబాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే కవిత, సంతోష్ రావుల సన్నిహితుల ఇళ్లల్లో ఇప్పుడే ఈడీ సోదాలు నిర్వహించడం, వారిని విచారణకు పిలవడంతో రానన్న రోజుల్లో ఏం జరుగుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కరీంనగర్ లో సంతోష్ రావు సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు చేపట్టింది. అంతేకాకుండా అతడికి సన్నిహితులుగా ఉన్నవారిని ఈడీ విచారణకు పిలిచింది.
దీంతో అప్పటినుంచి సంతోష్ రావు బయటకు రావడం లేదు. ఆయన ఆజ్ఞాతంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దీనిపై సంతోష్ రావు స్పందించారు. తాను ఎక్కడ ఉడాలో అక్కడు ఉన్నానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ లేకుండా తాను జీరో అని తెలిపారు. తానే మనిషినేని, శారీరక, మానసిక సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఢిల్లీ స్కాంపై ఏం జరుగుతుందో అదే జరుగుతుందన్నారు.
MP Santosh :
అయితే సంతోష్ రావు ఎప్పుడూ ప్రగతి భవన్ లోనే ఉంటారు. కేసీఆర్ తో పాటు ఉంటారు. కేసీఆర్ అపాయింట్లుమెంట్లు మొత్తం ఆయనే చూసుకుంటారు. కానీ గత నాలుగు రోజులుగా ఆయన ప్రగతిభవన్ లో కనిపించడం లేదు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంతోష్ రావు సన్నిహితుడు వెన్నమనేని శ్రీనివాసరావు చిక్కుకోవడంతో సంతోష్ రావు కనిపింంచకుడా పోయారని చెబుతున్నారు.